మాటల గారడీతో యాంకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది లాస్య. తనదైన కామెడీ పంచులు, జోక్స్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది.
ముఖ్యంగా ఏనుగు-చీమ జోక్స్‌తో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత యాంకర్ రవితో చేసిన షోలు బాగా ఆదరణ పొందాయి.
ఇక బిగ్‌బాస్ రియాల్టీషోలో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.
ఇక టీవీ షోలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుందీ అందాల తార.
నిత్యం తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను పంచుకుంటుంది. అలాగే తన సొంత యూట్యూబ్ ఛానెల్‌తో పంచుకుంటోంది.
ప్రముఖ యాంకర్ లాస్య మరోసారి తల్లికానుంది. ఇటీవల తాను గర్భం దాల్చినట్లు భర్త మంజునాథ్‌తో కలిసి సోషల్ మీడియా వేదికగా ప్రకటించిందీ.
తాజాగా ఆమె సీమంతం వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి. పలువురు బుల్లితెర సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరయ్యారు.
ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.
నెటిజన్లందరూ లాస్య దంపతులకు అభినందనలు తెలుపుతున్నారు. కాగా 2017లో మంజునాథ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది లాస్య.
వీరి ప్రేమకు ప్రతిరూపంగా 2019లో దక్ష్ అనే కుమారుడికి జన్మనిచ్చింది.