Telangana Rains: తెలంగాణకు వాయుగుండం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న 24 గంటల్లో వాయుగుండం తెలంగాణ మీదుగా కదలనుంది. తెలంగాణలో ఇప్పటికే పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్స్ ప్రకటించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాలు వణుకుతున్నాయి. వర్షాలు, వరదల ముప్పు పెరుగుతోంది.. దీంతో వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది.. నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Read also: Nani : సరిపోదా శనివారం కలెక్షన్ల తుఫాన్.. ఆంధ్ర – తెలంగాణలో భారీ వర్షాలు ..
నేడు హెచ్చరికలు ఉన్న జిల్లాలు ఇవే..
రెడ్ ఎలెర్ట్ (అత్యంత భారీ- 20.5 సెం.మీ.పైన వర్షపాతం):
ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల
ఆరెంజ్ ఎలెర్ట్ (అతి భారీ- 11.5 సెం.మీ.పైన):
కుమురం భీం, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగామ, వికారాబాద్, సంగారెడ్డి
ఎల్లో ఎలెర్ట్ (భారీ- 6.4 సెం.మీ. పైన):
రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్
Read also: Mahesh Babu: బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’పై మహేష్ ప్రశంసలు!
రద్దైన రైళ్లు:
భారీ వర్షాల వల్ల దక్షణ మధ్య రైల్వే పలు ట్రైన్స్ రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు చోట్ల రోడ్లు, రైలు పట్టాలు చెరువులుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లను రద్దు చేస్తూ.. దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. ఆది, సోమవారాల్లో దాదాపు 30 రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. విజయవాడ-కాజీపేట మార్గంలో 24 రైళ్లు నిలిచిపోయాయి.. సింహాద్రి, మచిలీపట్నం, గంగా-కావేరి, సంఘమిత్ర, గౌతమి, చార్మినార్, యశ్వంతపూర్ రైళ్లు నిలిచిపోయాయి..
1. ట్రైన్ నెంబర్ 12713 విజయవాడ – సికింద్రాబాద్
2. ట్రైన్ నెంబర్ 12714 సికింద్రాబాద్ – విజయవాడ
3. ట్రైన్ నెంబర్ 17201 గుంటూరు – సికింద్రాబాద్
4. ట్రైన్ నంబర్ 17233 సికింద్రాబాద్ – సిరిపూర్ ఖాగజ్ నగర్
5. ట్రైన్ నెంబర్ 12706 సికింద్రాబాద్ – గుంటూరు
6. ట్రైన్ నెంబర్ 12705 గుంటూరు – సికింద్రాబాద్ పై రైళ్లను ఈరోజు(02.09.24) రద్దు చేసింది.
AP and Telangana Rains LIVE UPDATES: తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు.. లైవ్ అప్‌డేట్స్
