Mahesh Babu: బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’పై మహేష్ ప్రశంసలు!
- మారుతీనగర్ సుబ్రమణ్యంపై మహేష్ రివ్యూ
- బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటూ పొగడ్త
- తబితకు ప్రత్యేక అభినందనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Babu About Maruthi Nagar Subramanyam: మంచి సినిమాలకు మద్దతు ఇవ్వడంలో ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు ఎప్పుడూ ముందుంటారు. సినిమాలో తనకు నచ్చిన విషయాలు చెప్పడంతో పాటు తన అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. తాజాగా ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ సినిమాకు మహేష్ రివ్యూ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో మారుతి నగర్ సుబ్రమణ్యం బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని పేర్కొన్నారు. చిత్ర నిర్మాత తబిత సుకుమార్‌ను ప్రత్యేకంగా అభినందించారు.
మారుతి నగర్ సుబ్రమణ్యం చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ మహేష్ బాబు తన ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘వాట్ ఏ హిలేరియస్ రైడ్. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి వినోదాత్మక చిత్రాల్లో మారుతి నగర్ సుబ్రమణ్యం ఒకటి. నిర్మాత తబిత సుకుమార్, చిత్ర బృదంకు అభినందనలు’ అని సూపర్ స్టార్ రాసుకొచ్చారు. మహేశ్ తమ సినిమాను అభినందించడంపై తబిత సుకుమార్ స్పందించారు. ‘మా సినిమాను చూసి మద్దతు ఇవ్వడం చాలా సంతోషం. మీ సపోర్ట్ లభించడం మా మూవీకి పెద్ద ఘనత’ అని పేర్కొన్నారు.
Also Read
- Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
- CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
- CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
- AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
Also Read: KL Rahul-LSG: కెప్టెన్‌గా అద్భుతం.. లక్నోలోనే రాహుల్!
లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ సినిమా.. తబితా సుకుమార్ సమర్పణలో విడుదలైంది. ఇందులో రావు రమేశ్ కీలక పాత్ర పోషించారు. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆగస్ట్ 23న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాను కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతరం సైతం ఎంజాయ్ చేస్తోంది.
What a hilarious ride! #MaruthiNagarSubramanyam is one of the best family entertainers in recent times… Congratulations @Thabithasukumar and the entire team! @lakshmankarya @kalyannayak_ofl @lokamaatre @AnkithKoyyaLive @RamyaPasupulet9 @mohankarya @sriudayagiri…
— Mahesh Babu (@urstrulyMahesh) August 31, 2024
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!