NTV Telugu Site icon

Wether Alert: రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

Wether Alert

Wether Alert

బంగాళాఖాతంలో ఈనెల 19న (రేపు) అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. భారతదేశ నైరుతి ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈనేపథ్యంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఈవానలకు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో.. ఉరుములు, మెరుపులతో, అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణశాఖ తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పింది. దీంతో జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, కరీంనగర్‌, మెదక్‌, వరంగల్‌, హన్మకొండ, భూపాల్‌పల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్‌, ఖమ్మం, మేడ్చల్‌, రంగారెడ్డి, భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

అటు వాయుగుండం ఎఫెక్ట్ ఏపీలోనూ తీవ్రంగా ఉందని అమరావతి వాతావరణకేంద్రం వెల్లడించింది. రానున్న రెండు రోజులపాటు ఉత్తరకోస్తా, దక్షిణకోస్తా, రాయలసీమలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే.. మరోవైపు అల్పపీడన ప్రభావతం ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.
Kidney Infection : కిడ్నీ ఇన్ఫెక్షన్‌ నివారించే ఇంటి చిట్కాలు