వాతావరణ శాఖ అంచనాలకు భిన్నంగా బంగాళాఖాతంలో అల్ప పీడనం కదులుతోంది. ప్రస్తుతం దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు సమీపాన తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ నైరుతిగా పయనించి దక్షిణ కోస్తా తీరం వైపు వచ్చే క్రమంలో బల హీనపడుతుందని అంచనాలు వున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ సూచిస్తోంది.. ఈ నెల 23వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది క్రమంగా వాయుగుండంగా బలపడొచ్చని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ఇది తమిళనాడు, శ్రీలంక తీరాలవైపు కదిలే అవకాశముంది. దీని ప్రభావంతో ఈ నెల 26 తర్వాత దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ఐఎండీ సూచనల ప్రకారం నైరుతి బంగాళాఖాతంలోని ఆవర్తనం ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఇది తదుపరి రెండు రోజుల్లో పశ్చిమ దిశగా నెమ్మదిగా తమిళనాడు / శ్రీలంక తీరాల వైపు కదిలేందుకు అవకాశం ఉందన్న ఆయన.. మరోవైపు నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర నుండి పశ్చిమమధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని తెలిపారు.. దీని ప్రభావంతో రేపటి నుంచి మూడు రోజుల…
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తూర్పు ఏజెన్సీ ప్రాంతంలో కుంభవృష్టిగా వర్షం కురుస్తుంది. సుమారు రెండుగంటలుపైగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకలు. పొంగిపొర్లుతున్నాయి. మారేడుమిల్లిలో వాగులు పొంగి రోడ్లపై ప్రవహించడంతో వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్‌లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్ష సూచనలు ఉన్నాయని పేర్కొంది.
బంగాళాఖాతంలో ఈనెల 19న (రేపు) అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. భారతదేశ నైరుతి ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈనేపథ్యంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఈవానలకు ఆదిలాబాద్,…