NTV Telugu Site icon

Heavy rain Alert: తెలంగాణకు అత్యంత భారీ వర్షసూచన.. రెడ్ అలర్ట్ జారీ

Heavyrainalert

Heavyrainalert

గురువారం తెలంగాణలో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జిల్లాల్లో రెడ్ అలర్ట్ అమల్లో ఉండనుంది. జూలై 21 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని తెలిపింది. ఇక హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాకుండా ఈదురుగాలులు వీచే ఛాన్సుందని చెప్పింది. వర్షాలు కారణంగా ఉష్ణోగ్రతలు భారీగా తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇది కూడా చదవండి: TG EAMCET 2024: ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్.. ఇంజనీరింగ్‌ ఫేజ్‌-1 సీట్ల కేటాయింపు ఆలస్యం..!

హైదరాబాద్‌లో ఎల్లో అలర్ట్‌ జారీ చేయడంతో జూలై 22 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే తెలంగాణలో పలు జిల్లాల్లో అక్కడక్కడా విస్తారంగా వర్షాలు కురుస్తు్న్నాయి. జయశంకర్ జిల్లాలో అత్యధికంగా 207.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లిలో అత్యధికంగా 25.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

ఇది కూడా చదవండి: AP CID: ఏపీబీసీఎస్‌లో అవకతవకల ఆరోపణలపై సీఐడీ ఫోకస్‌