హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ప్రయాణం అంటేనే ఒక యుద్ధం. ఆఫీస్‌కు వెళ్లాలన్నా, ఇంటికి రావాలన్నా కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్‌లు.. గంటల తరబడి సిగ్నల్ దగ్గర నిరీక్షణ. కానీ, త్వరలోనే మనం ఈ రోడ్లపై పాకాల్సిన అవసరం లేదు.. పక్షుల్లా గాలిలో ఎగురుతూ గమ్యస్థానానికి చేరుకోవచ్చు! అవును, మీరు విన్నది నిజమే. IIT హైదరాబాద్ (IIT-H) పరిశోధకులు పట్టణ ప్రయాణ ముఖచిత్రాన్ని మార్చేసే ఒక అద్భుతమైన ‘ఎయిర్ టాక్సీ’ (Air Taxi) ప్రోటోటైప్‌ను సిద్ధం చేశారు.
Samsung మైండ్ బ్లోయింగ్ లాంచ్..CES 2026లో ‘Galaxy Book6’ సిరీస్..!
ఇది కేవలం ‘టాక్సీ’ కాదు.. భవిష్యత్తు ప్రయాణం.!
సంగారెడ్డి జిల్లా కందిలోని IIT హైదరాబాద్ క్యాంపస్‌లో శనివారం ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. ఫ్యాకల్టీ సభ్యులు దీపక్ జాన్ మాథ్యూ, ఆయన సహచరుడు కేతన్ చతుర్మత కలిసి రూపొందించిన ఈ సూపర్ ఎయిర్ ట్యాక్సీ భవిష్యత్తులో మన రవాణా కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపబోతోంది.
ఈ ఎయిర్ టాక్సీ ప్రత్యేకతలు ఏంటి?
ప్రాణాలను కాపాడే ‘ఏంజిల్’
ఈ ఎయిర్ టాక్సీ కేవలం ఆఫీసులకు వెళ్లడానికే కాదు, అత్యవసర వైద్య సేవల్లోనూ విప్లవం తీసుకురానుంది. ముఖ్యంగా అవయవ మార్పిడి (Organ Transplant) సమయంలో మానవ అవయవాలను ఒక ఆసుపత్రి నుండి మరో ఆసుపత్రికి నిమిషాల వ్యవధిలో చేర్చడానికి ఇది సంజీవనిలా పనిచేస్తుంది. ట్రాఫిక్ వల్ల ఒక్క నిమిషం ఆలస్యమైనా ప్రాణాలు పోయే స్థితిలో, ఈ ఎయిర్ టాక్సీ ‘గ్రీన్ ఛానల్’ కంటే వేగంగా పనిచేస్తుంది.
రోడ్లపై ఎప్పుడు ఎగురుతుంది?
ప్రస్తుతం ఈ ప్రోటోటైప్ పరీక్షల దశలో ఉంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నుండి అనుమతులు రావాల్సి ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే, 2026 లేదా 2027 నాటికి ఈ ఎయిర్ టాక్సీలు వాణిజ్యపరంగా మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
మనం సినిమాల్లో చూసే సైన్స్ ఫిక్షన్ దృశ్యాలు త్వరలోనే హైదరాబాద్ గగనతలంపై నిజం కాబోతున్నాయి. రోడ్లపై హారన్ల గోల, కాలుష్యం నుండి తప్పించుకుని.. హాయిగా గాలిలో ప్రయాణించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. శాస్త్ర సాంకేతిక రంగంలో భారత్, ముఖ్యంగా మన తెలంగాణ గడ్డపై ఉన్న IIT హైదరాబాద్ సాధించిన ఈ విజయం గర్వించదగ్గ విషయం..
LG మరో మ్యాజిక్..! గోడకు అతుక్కుపోయే Wallpaper TV.. 9mm మందం.. 4 రెట్లు ఎక్కువ బ్రైట్‌నెస్.!