NTV Telugu Site icon

Rajagopal Reddy: సెకెండ్‌ హ్యాండ్‌, క్యారెక్టర్‌ లేని ఎమ్మెల్యేలు మాకొద్దు.. అర్ధరూపాయి పెట్టిన ఎవరు కొనరు

Rajagopal Reddy

Rajagopal Reddy

Rajagopal Reddy: సెకండ్ హ్యాండ్ ఎమ్మెల్యేలు, క్యారెక్టర్ లేని ఎమ్మెల్యేలు తమకు అవసరం లేదని, వారి నెత్తిమీద రూపాయ పెట్టినా అర్ధ రూపాయకి కూడా ఎవరు కొనరని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా ఉన్నాడని, ఆయనైనా తానైనా ప్రజల కోసమే, ప్రజా శ్రేయస్సు కోసమే పోరాడుతున్నామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ సభలో నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసిందని ఆరోపించారు. ఆ నలుగురిలో ముగ్గరు ఎమ్మల్యేలు ఇతర పార్టీల నుంచి సీఎం కేసీఆర్‌ కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలేనని రాజగోపాల్‌ రెడ్డి ఆరోపించారు. అయితే.. మునుగోడు నియోజకవర్గంలో తాను యువత చదువుల కోసం సహాయం చేస్తుంటే, సీఎం యువతను మద్యం మత్తులోకి లాగి వారి జీవితాలతో ఆడుకుంటున్నాడని మండిపడ్డారు.

Read also: Unstoppable 2 Promo: మూడో వారం కూడా యువహీరోలే.. బాలయ్యతో రష్మిక ముచ్చట్లు

ఇక,కరోనా సమయంలో తమ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సహాయం చేశామన్నారు…మధ్య నిషేధం చేసిన గ్రామాలని పార్టీతో సంబంధం లేకుండా సొంత డబ్బులను ప్రోత్సాహకంగా ఇచ్చానని తెలిపారు. మునుగోడు ఎన్నికల కోసం తన కుమారుడి కంపెనీపై బురద చల్లే ప్రయత్నం చెయ్యడమే కాకుండా బ్యాంక్‌ అకౌంట్స్‌ని హోల్డ్‌ చేయించిన మూర్ఖుడు సీఎం కేసీఆర్‌ అని రాజగోపాల్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రచారం సమయంలో కావాలనే టీఆర్‌ఎస్‌ వాళ్లు కొంత మందికి మద్యం తాగించి తనపై దాడులు చేపిస్తున్నారని ఆరోపించారు గతవారం రోజులుగా తాను జ్వరంతో బాదపడుతుంటే సీఎం కేసీఆర్‌ దాన్ని సింపతీ కోసమని టీఆర్‌ఎస్‌ వాళ్లు ప్రచారం చేశారని, రాష్ట్రంలో అరాచక పాలన, దుర్మర్గపు పాలన పోవాలంటే మునుగోడు ప్రజలు బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. రాజగోపాల్‌ రెడ్డి ఎలాంటి మనిషో మునుగోడు నియోజకవర్గ ప్రజలకు తెలుసని తెలిపారు.
Bharat Jodo Yatra: రాహుల్ పాదయాత్రలో రోహిత్‌ వేముల తల్లి.. ఫోటో వైరల్