CPI Narayana: మోడీకి కేసీఆర్ జై కొడితే.. రాత్రికి రాత్రే కేసులు మాయమౌతాయి

Cpi Narayana On Bjp

Cpi Narayana On Bjp

If KCR Hails Modi Then Cases On Telangana Will Be Dismissed Says CPI Narayana: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి కేంద్రంలో ఉన్న బీజేపీపై ఉక్కుపాదం మోపారు. తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది కాబట్టి.. ఆ పార్టీపై కేంద్రం దాడులు చేస్తోందని ఆరోపణలు చేశారు. ఒకవేళ ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ జై కొడితే.. రాత్రికి రాత్రే కేసులన్నీ మాయమవుతాయని అన్నారు. తృణమూల్ కాంగ్రెస్‌లో శారద, నారద కేసుల్లో ఉన్నవాళ్లు.. బీజేపీలో చేరగానే ఏమైందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించే రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలు, వ్యక్తులపై.. కేంద్రం ఏకపక్ష దాడులు జరుపుతోందని వ్యాఖ్యానించారు.

ఇక జీ-20కి భారత్ నాయకత్వం వహించడాన్ని సీసీఐ స్వాగతిస్తుందని నారాయణ అన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళా మహిళా బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. మహిళా బిల్లు ఆమోదించకుండా.. జీ-20లో మహిళా సాధికారతపై ఏం చర్చిస్తారు? అని ప్రశ్నించారు. ఈమధ్యే వెంకయ్యనాయుడు సైతం మహిళా బిల్లుని ఆమోదించాల్సిన అవసరం ఉందని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. మహిళా బిల్లు ఆమోదానికి సీపీఐ పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. జీ-20లో పుష్పం గుర్తును లోగాగా పెట్టారని.. ఇది సంకుచిత స్వభావానికి నిదర్శనమని.. దీన్ని వెంటనే తొలగించాలని కోరారు.

×
×
Ad

బీజేపీకి వైసీపీ నుంచి ఎక్కువ మద్దతు లభిస్తోందని.. ఏపీలో వైసీపీ గెలిస్తే, బీజేపీ గెలిచినట్టేనని నారాయణ పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ఎక్కువగా.. వైసీపీ నుంచే ఆ పార్టీకి మద్దతు దక్కుతోందన్నారు. టీడీపీని బలహీనపర్చడం కోసం పవన్ కళ్యాణ్‌ను బీజేపీ తమవైపు లాగుతోందన్నారు. మరి.. పవన్ కళ్యాణ్ ఎంతవరకు కలిసొస్తారో చూడాలని అన్నారు. మోడీకి మద్ధతిచ్చే వైసీపీకి వ్యతిరేకంగా అందరూ కలవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.