NTV Telugu Site icon

Jaggareddy: నాకు పీసీసీ కావాలి.. వచ్చేంత వరకు అడుగుతా

Jaggareddy

Jaggareddy

I want PCC.. I will keep asking until it comes Jaggareddy: పీసీసీ హోదాలో వున్న రేవంత్‌ రెడ్డి ఇంటి పెద్దమనిషిగా వ్యవహరించాలని, 24 గంటలు సర్వీస్‌ ఇవ్వాల్సిందే అని సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం నాకు అలవాటని, అసమ్మతి కాంగ్రెస్ లో సహజమని, అన్ని పార్టీలలో అసమ్మతి ఉంటుందని అన్నారు. కొందరు అసమ్మతి పదాన్ని కోవర్టులుగా కొందరు మూర్ఖులు మార్చేశారని మండిపడ్డారు. నేను మొదటి నుండి పీసీసీ కావాలని అడుగుతున్న.. నాకు పీసీసీ పదవి వచ్చే వరకు అడుగుతా అంటూ మండిపడ్డారు. నేను ఏదైనా మాట్లాడితే గొడవ అంటారు. చాలా మాట్లాడాలి అనుకున్న.. నా ఒక్కడి మీదనే ఎందుకు వేసుకోవడం, రాజకీయ పార్టీలో కుర్చీ అడగడం.. ట్రై చేయడం సహజం అందులో తప్పేముందన్నారు జగ్గారెడ్డి.

Read also: Manjima Mohan: పెళ్లితో ఒక్కటైన గౌతమ్ కార్తీక్, మంజిమా మోహన్

మోడీ ఎప్పుడు దిగి పోతాడో ..రాహుల్ గాంధీ పీఎం కావాలని అనుకుంటున్నాం కదా అని మాట్లాడారు. ఉత్తమ్ ని దించండి అని అప్పుడు అనలేదా? రేవంత్ ని ఎక్కించండి అనలేదా? దానికి ఎవరు సమాధానం చెప్పాలి? అంటూ ప్రశ్నించారు జగ్గారెడ్డి. రేవంత్ ని దించండి అని ఎవడు అడిగాడు? ఎన్నికలు ఐపోని.. మేము సహకరించడం లేదు అంటే రేవంత్ ఫెయిల్ అయినట్టే కదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ అందరి జాగిరు.. జగ్గారెడ్డి దో.. రేవంత్ దో కాదన్నారు. కాంగ్రెస్ నాయకుల అందరిదీ అని అన్నారు. రేవంత్ ని దించి ఎక్కాలాని ఎవడికి లేదు అని సంచళన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు రేవంత్ నాయకత్వంలోనే నడిపిద్దాం.. ఇప్పుడు దించే ఆలోచన కూడా అధిష్టానంకి లేదని అన్నారు. పీసీసీ పోస్ట్ లో ఎవరన్నా లాభనష్టాలు పీసీసీ వహించాలని అన్నారు. పీసీసీ గా రేవంత్ సమిష్టి నిర్ణయాలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.

read also: Gautam Gambhir: భారత్ vs పాకిస్తాన్.. ఆ ఇద్దరు కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం

ఆయనకు ఆయనే నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. రేవంత్ ఎవరిని అడిగి నిర్ణయాలు తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. Pac మీటింగ్ లి అందరం అయ్యాం..అటెండ్ కాలేదు అనేది అబద్ధమన్నారు జగ్గారెడ్డి. మీటింగ్ లో అడిగినా చెప్పడం లేదని స్పష్టం చేశారు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తే వినడానికి నేనేమైన చంటి పిలగాన్నా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖర్గే ని కలిసిన తరువాత టీఆర్‌ ఎస్‌, బీజేపీ మీద కంటే ఆయాన కుర్చీ గురించి మాట్లాడారని అదేంటో మరి అంటూ వ్యంగాస్ర్తం వేశారు జాగ్గారెడ్డి. రేవంత్ ఎందుకు టెంప్ట్ ఐతున్నాడో అర్థం కాలేదని మండిపడ్డారు. రేవంత్ ని కూడా అడుగుతా..ఎందుకు టెంప్ట్ అవుతున్నావు అని అంటూ జగ్గారెడ్డి అన్నారు. రేవంత్ ని ఎన్నికల వరకు కొనసాగించాలి అనేదే నా ఆలోచన అన్నారు. రేవంత్ ప్రబ్లమ్ ఏందో అడుగుతా మీటింగ్ లో అన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అవి కామన్ అన్నారు. రేవంత్ ని ఇబ్బంది పెట్టే అవసరం లేదు మాకు అని జగ్గారెడ్డి తెలిపారు. పీసీసీ అంటేనే ఫ్రీ హ్యాండ్ అన్నారు. సహకారం అంటే ఏందో చెప్పండని ప్రశ్నించారు.

Read also: Minister KTR : జీ20 లోగోకు రిటర్న్ గిఫ్ట్‌గా తెలంగాణకు మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌ను మంజూరు చేయండి

మెట్రోని సంగారెడ్డి వరకు పొడిగించాలని డిమాండ్

మెట్రో కాంగ్రెస్ హయాంలోనే వచ్చిందని, కేటీఆర్‌ డిసెంబర్ 9 న శంషాబాద్ వరకు మెట్రో పనులకు శంకుస్థాపన చేస్తావని అన్నారు, మెట్రోని సంగారెడ్డి వరకు పొడిగించాలని డిమాండ్ చేశారు జగ్గారెడ్డి. చాలా రోజులుగా అడుగుతున్న, అసెంబ్లీ లో సీఎం ని కూడా అడుగుతా అని అన్నారు. చాలా కంపెనీలు ఉద్యోగులు సంగారెడ్డి లొనే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. కేటీఆర్ కి లేఖ రాసానని అన్నారు. సంగారెడ్డి వరకు మెట్రో సేవలు అందించాలని కోరారు. హైదరాబాద్.. సంగారెడ్డి ఫోర్వే లైన్ కూడా బిజీ ఉన్నాయని పేర్కొన్నారు. యాదగిరి గుట్ట వరకు మెట్రో పొడగించాలని, గుట్ట సీఎం డవలప్ చేశారని, మెట్రో పోడగిస్తే మంచిదని పేర్కొన్నారు. దానిపై కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని జగ్గారెడ్డి కోరారు.