కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాతో టచ్ లో ఉన్నాడని నేను ఎప్పుడు అనలేదని బండి సంజయ్ స్పష్టం చేసారు. యాదాద్రి జిల్లా మోత్కూర్ లో మీడియా చిట్ చాట్ లో మాట్లాడిన ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాతో టచ్ లో ఉన్నాడని నేను ఎప్పుడు అనలేదని, ఆయన చాలా మంచి పొలిటికల్ లీడర్ అని చెప్పుకొచ్చారు. బీజేపీ ప్రభుత్వం ఈడీ ని వాడుకోవాలని చూస్తే తెలంగాణలో ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే కూడా మిగలడని హెచ్చరించారు.
మునుగోడు ఉప ఎన్నిక నుండి కాంగ్రెస్, టీఆరెఏస్ ఎప్పుడో పారిపోయాయిందని సంచలన వాఖ్యలు చేశారు. కమ్యూనిస్టులు ఎప్పుడు పోతారో చూడాలని అన్నారు. కమ్యూనిస్టులు ఎప్పుడు ఎలా ఉంటారో వారికే తెలియదని అన్నారు. దుబ్బాకలో కాంగ్రెస్ క్యాడర్ బీజేపీకి సపోర్ట్ చేసింది, కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయిందని తెలిపారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు విమర్శించలేదు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుని మాత్రమే విమర్శించాడని బండి సంజయ్ తెలిపారు. కేసీఆర్ బొమ్మ పెట్టుకొని తిరిగితే ఓట్లు పడే రోజులు ఎప్పుడో పోయాయని ఎద్దేవ చేసారు. టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు లైసెన్సుడ్ గుండాలు అయిపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రులు గాల్లోకి కాల్పులు జరుపుతుంటే.. రజాకార్ల పాలన మళ్ళీ వచ్చిందా అనిపిస్తుందని తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి అనుసంధానంగా ఉన్న అధికారుల లిస్ట్ రెడీ చేస్తున్నామన్నారు. అధికారం లోకి వచ్చాక వాళ్ళ సంగతి చెప్తాం అంటూ హెచ్చరించారు.
“ప్రజా సంగ్రామ యాత్ర” 12వ రోజుకు చేరుకుంది. గుండాల నుంచి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభమైంది. గుండాల నుంచి పాచిల్ల, తుర్కల్ షాపూర్, పెద్దపడ్సల, వస్త కొండూరు మీదుగా బండకొత్తపల్లి వరకు పాదయాత్ర కొనసాగనుంది. తుర్కల్ షాపూర్ లో బండిసంజయ్ రచ్చబండ నిర్వహించనున్నారు. బండకొత్తపల్లి సమీపంలో బండి సంజయ్ రాత్రి బస చేయనున్నారు.
Read also: Vijay Devarakonda Liger: అనన్య, విజయ్ దేవరకొండ హాట్ ప్రమోషన్.. క్యాప్షన్ ఇచ్చిన హీరోయిన్