Satyavathi Rathod: తెలంగాణలో ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికల వేడి రాజుకుంది. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు మునుగోడులో మకాం వేసి ప్రచారం నిర్వహిస్తున్నాయి. గెలుపే ధ్యేయంగా అన్ని పార్టీలు పోరు సాగిస్తున్నాయి. ఈ మునుగోడు పోటీలో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఇక, అధికార టీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో మంత్రులంతా మొగ్గు చూపుతూ ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న శనివారం మంత్రి సత్యవతి రాథోడ్ కూడా ప్రచార బరిలోకి దిగారు. భువనగిరి జిల్లా రాధానగర్ తండాలో మంత్రి చెప్పులు లేకుండా ప్రచారం నిర్వహించారు. అయితే ఆమె చెప్పులు లేకుండా ప్రచారం చేయడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. దాని గురించి ఆమె వివరణ ఇస్తూ.. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు పాదరకలు ధరించనని చెప్పారు. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి దీక్ష చేపట్టామని.. గిరిజనుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు.
Read also: Ind Vs Pak: పాకిస్థాన్ హ్యాట్రిక్ కొడుతుందా? టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా?
6 శాతం రిజర్వేషన్లను 10 శాతానికి పెంచారని గుర్తు చేశారు. వారి కోసం గిరిజన బంధు పథకం కూడా ప్రవేశపెట్టామన్నారు. తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేశారన్న సత్యవతి రాథోడ్ మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే వరకు చెప్పులు వేసుకోనని స్పష్టం చేశారు. ఆయన మళ్లీ ముఖ్య మంత్రి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లాలని అన్నారు. కేసీఆర్ పథకాలు ప్రతి ఒక్క రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశ్యంతోనే చెప్పులు వేసుకోలేదని ఎప్పుడైతే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారో అప్పుడే ధరిస్తానని తేల్చిచెప్పేసారు. అయితే ఆమె చెప్పులు లేకుండా మునుగోడు ప్రచారంలో పాల్గొనడం అందరి దృష్టి ఆకర్షిస్తోంది.
Vijayawada: దీపావళి ముందు రోజే విజయవాడలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు సజీవదహనం