Site icon NTV Telugu

HYDRA : రెండు కాలనీల మధ్య ‘హైడ్రా’ బ్రిడ్జ్.. అడ్డుగోడ తొలగింపుతో కలిసిన కాలనీలు

Hydra

Hydra

HYDRA : హైద్రాబాద్‌ నగరంలో రెండు కాలనీల మధ్య సౌకర్యాన్ని హైడ్రా సంస్థ మరింత మెరుగుపరిచింది. హబ్సీగూడ ప్రాంతంలోని స్ట్రీట్ నంబర్ 6 వద్ద ఉన్న అడ్డుగోడను తొలగించడం ద్వారా నందనవనం, జయానగర్ కాలనీల మధ్య అనుసంధానం ఏర్పడింది. దీని వల్ల రెండింటికీ మధ్య ప్రయాణ దూరం గణనీయంగా తగ్గింది.

Rare-earths: “అరుదైన భూమి” కోసం భారత్ ఆరాటం.. చైనాకు చెక్ పెట్టే ప్లాన్..

గతంలో నందనవనంలోని స్ట్రీట్ నంబర్ 4 నుంచి హబ్సీగూడ మెయిన్ రోడ్ చేరేందుకు వాసులు దాదాపు 1.5 కిలోమీటర్లు చుట్టువాటు ప్రయాణించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అడ్డుగోడ తొలగింపుతో కేవలం 300 మీటర్ల దూరంలోనే ఎన్జీఆర్‌ఐ మెట్రో స్టేషన్ చేరుకునే అవకాశం లభించిందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గురువారం ఉదయం హైడ్రా టీమ్ హస్తకల్పంగా ఈ అడ్డుగోడను తొలగించింది. ‘‘15 ఏళ్లుగా ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులను కలిసి కోరినా స్పందన రాలేదు. జయానగర్ అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. చివరికి హైడ్రా ద్వారా ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో తక్షణమే చర్యలు తీసుకుని మార్గం తెరిచారు,’’ అని నందనవనంలోని కాంక్రీట్ ట్రంపెట్ అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. ఈ పరిణామంతో దశాబ్దాలుగా ఎదురైన సమస్యకు పరిష్కారం లభించడంతో స్థానికులు హైడ్రా టీమ్‌పై కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Bahubali: ‘బాహుబలి’ల రీయూనియన్

Exit mobile version