తెలుగు సినీ పరిశ్రమ మాత్రమే కాదు, భారత సినీ పరిశ్రమ స్థితిగతులను మార్చిన బాహుబలి రిలీజ్‌కు 10 ఏళ్లు పూర్తయ్యాయి. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, రానా విలన్‌గా నటించిన ఈ సినిమా సుమారు 10 ఏళ్ల క్రితం ఇదే రోజు విడుదలై అద్భుతమైన విజయాన్ని సాధించింది.
Also Read:Shikhar Dhawan: అంతర్జాతీయ క్రికెట్‌లో నేను ఎదుర్కొన్న డేంజరస్ బౌలర్లు వాళ్లే..

తెలుగు సినీ పరిశ్రమలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి వందల కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన బాహుబలి 2 ఈ సినిమా రికార్డులను బద్దలు కొట్టింది, అది వేరే విషయం. బాహుబలి విడుదలై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ రోజు బాహుబలి టీమ్ మొత్తం మళ్లీ కలుసుకుంది.
Also Read:Chiranjeevi : విశ్వంభర సెట్స్ నుంచి మెగాస్టార్ లుక్..!

రాజమౌళి, ప్రభాస్, రానా, నాజర్, రమ్యకృష్ణ, సత్యరాజ్, శోభు యార్లగడ్డ, సినిమాకు పనిచేసిన వీఎఫ్ఎక్స్ కణల్ కణ్ణన్, కీరవాణి భార్య శ్రీవల్లి, రాజమౌళి భార్య రమా కలిశారు. అయితే, తాజాగా కీరవాణి తండ్రి పరమపదించిన నేపథ్యంలో కీరవాణి ఈ వేడుకకు హాజరు కాలేదు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
