Site icon NTV Telugu

Free Bus Effect: ఉచిత బస్సు ఆడవాళ్లకు.. డ్రైవర్లు, కండక్టర్లకు ఫ్రీగా దెబ్బలు!

Freebuseffect

Freebuseffect

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ బస్సు సదుపాయం అమలవుతోంది. ఉచిత ప్రయాణ మనో.. ఇంకెం కారణమో తెలియదు గానీ.. ఆర్టీసీ బస్సులన్నీ ఫుల్ రద్దీగా తిరుగుతున్నాయి. అన్ని సీట్లు మహిళలతో నిండిపోతున్నాయి. ఇక సీట్ల కోసమైతే డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటింగ్‌లు కూడా జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. తాజాగా మరొక సంఘటన వెలుగులోకి వచ్చింది. డ్రైవర్, కండక్టర్‌ను మహిళలు కొడుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Nara Lokesh: వైసీపీకి నారా లోకేష్ ఓపెన్ ఛాలెంజ్.. 24 గంటల డెడ్ లైన్

ఫ్రీ బస్సు అమల్లోకి వచ్చాక హైదరాబాద్‌లో సిటీ బస్సులన్నీ ఫుల్ రద్దీగా తిరుగుతున్నాయి. ఇక ప్రయాణికులు ఎక్కువగా ఉంటే కొన్ని స్టాపుల్లో ఆపకుండానే డ్రైవర్లు బస్సులను పోనిస్తు్న్నారు. తాజాగా ఆర్టీసీ సిబ్బందితో మహిళా ప్రయాణికులకు ఘర్షణ చోటుచేసుకుంది. బస్సు కిందకు దిగి మహిళలు వాదిస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఇరు పక్షాల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. ఈ వాగ్వాదంలో బూతు మాటలు కూడా మాట్లాడుకున్నారు. అనంతరం కండక్టర్‌ను మహిళలు చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది. దేని కోసం జరిగింది అనే విషయం తేలాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: Israeli Operation: 1981లో ఇరాక్, 2025లో ఇరాన్.. ఇజ్రాయిల్ డేరింగ్ ఆపరేషన్స్..

Exit mobile version