Mallikarjun Kharge: హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయం సమరభేరి సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి పని చేశారని పేర్కొన్నారు. కార్యకర్తల కృషి వల్లే తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చిందని కొనియాడారు. ఇక, కేసీఆర్, బీజేపీ.. తెలంగాణలో కాంగ్రెస్ ను అడ్డుకున్నారు.. హైదరాబాద్ లో ఉన్న పెద్ద పరిశ్రమలను.. నరేంద్ర మోడీ తీసుకు రాలేదని సెటైర్లు వేశారు. హైదరాబాద్ లో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయని గుర్తు చేశారు మల్లికార్జున ఖర్గే.
Read Also: JNTU-H: JNTU హైదరాబాద్ బోర్డు ఆఫ్ స్టడీస్ సమావేశం.. R25 నిబంధనలపై కీలక నిర్ణయాలు..!
అయితే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చిందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సహా అందరూ కలిసికట్టుగా పని చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు.. తెలంగాణలో కులగణన.. దేశానికే రోల్ మోడల్ అని తెలిపారు. బీసీ రిజర్వేషన్లు అమలయ్యే వరకు పోరాడుతూనే ఉంటామని ఆయన తేల్చి చెప్పారు. ప్రధాని మోడీ చెప్పేవి అన్నీ అబద్దాలే అని ఏఐసీసీ చీఫ్ ఖర్గే ఆరోపించారు. గత 11 సంవత్సరాలలో నరేంద్ర మోడీ తెలంగాణకు ఏం ఇచ్చారని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు 15 లక్షల రూపాయలతో పాటు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాడు.. ఆ తర్వాత హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. కానీ, కాంగ్రెస్ పార్టీ ఏం చెబుతుందో అది చేసి చూపిస్తుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను.. బీజేపీ నాశనం చేసిందని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.
