Rajnath Singh: చాలా మంది యోధులు చిన్న వయసులోనే స్వాతంత్ర్య కోసం ప్రాణాలు వదిలారు అని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు వంటి వాళ్ళు ఎంతోమంది తమ ప్రాణాలు వదిలారు.. భారత స్వాభిమానం, తెలుగు రాష్ట్రాల గుర్తుగా నిలిచిపోయారు.. అల్లూరి కేవలం పోరాట యోధుడే కాదు ప్రజలు కోసం అన్ని కోల్పోయిన నాయకుడు గుర్తుకు వస్తాడు.. సాంస్కృతిక ఆత్మ భారతదేశాన్ని ఐక్యంగా ఉంచుతుంది.. అల్లూరి పేరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కే కాదు దేశం మొత్తం గుర్తింపు ఉంది.. ఆడవుల నుంచి పుట్టిన పోరాటాలు ఇప్పటికీ గుర్తున్నాయి.. దశాబ్దాల పోరాటాలకు ఆయన మార్గదర్శనం చేశారు.. అడవుల్లో ఆయన పోరాటాలు బ్రిటిష్ వారిని వణికించాయి.. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఆయుధాలు ఎత్తాల్సి వచ్చింది అని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.
Read Also: Minister Nara Lokesh: ఇంటర్ విద్యపై లోకేష్ సమీక్ష.. కీలక ఆదేశాలు
ఇక, గిరిజనులపై, వారి భూమి పై ఆంక్షలు విధించారు అని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. గౌరవంగా జీవించాదని అల్లూరి సీతారామరాజు పిలుపు ఇచ్చారు.. అల్లూరి సీతారామరాజు జీవించిన ప్రాంతాలను కేంద్రం అభివృద్ధి చేస్తుంది.. బాలికల చదువు కోసం పాఠశాల ల అభివృద్ధి జరుగుతుంది.. 108 సూర్య నమస్కారాలు కేవలం దేహం దారుధ్యం కోసం కాదు.. మానసిక అభ్యున్నతికి ఉపయోగపడతాయి.. క్రమంగా అడవులు నక్సల్స్ కు అడ్డంగా మారాయి.. ఇప్పుడు నక్సల్స్ పూర్తిగా తుడిచిపెట్టుకు పోతున్నాయి.. ఆగస్టు 2026లోపే నక్సల్స్ ను తుడిచి పెట్టేస్తాం.. నక్సల్స్ చేతిలో బంధీగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు అభివృద్ధి వేగంగా జరుగుతోంది.. వేగంగా గ్రోత్ కారిడార్ లుగా అభివృద్ధి చెందుతున్నాయి.. కనీసం నెట్వర్క్ లేకపోయేది.. టీవీలు, ల్యాప్ టాప్ లు, మొబైల్ టవల్ లు కూడా లేకుండాపోయాయి.. 8 వేల టవర్లను ప్రారంభించేందుకు సిద్ధం గా ఉన్నాయని రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.
పహెల్గామ్ లో దాడి తరువాత ఆపరేషన్ సింధూర్ తో ధైర్యం, ధర్మం, ఖర్మను పరిచయం చేశామని రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. రామాయణంలో హనుమంతుడు చేసిన పనే ఇప్పుడు మనం చేశాం.. మనల్ని ఎవరు చంపారో వారిని మాత్రమే చంపాం.. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరిగితే తగిన సమాధానం చెబుతాం.. న్యాయం అందిరికీ సమానం గా దక్కాలి.. జాతి నిర్మాణంలో గిరిజనుల పాత్ర మరువలేనిది.. ఆదివాసీలను సాధారణ జనజీవనంలోకి తీసుకుని రావాల్సిన అవసరం ఉంది.. 50, 000లకు పైగా ఆదివాసీ గ్రూపులను ఏర్పాటు చేశాం.. మొదటి సారి గిరిజన మహిళను రాష్ట్రపతి చేశాం.. అల్లూరి సీతారామరాజు సంకల్పాన్ని ప్రతి గ్రామం, ఇంటికి తీసుకుని వెళ్దామని రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు.
