Jupally Krishna Rao: హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో ప్రపంచ సుందరీమణులతో నిర్వహించిన స్పోర్ట్స్ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఒకప్పుడు క్రీడల్లో మహిళల ప్రాతినిధ్యం నామమాత్రంగానే ఉండేది.. కానీ ఇప్పుడు ప్రాతినిధ్యం స్థాయి నుంచి పతకాలు అందించే స్థాయికి ఎదిగారని అన్నారు. పురుషులతో సమానంగా క్రీడల్లో పోటీ పడుతూ, ప్రజాదరణ పొందుతున్నారని తెలిపారు. శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడు మానసిక స్థైర్యం పెరుగుతుంది.. అది మనం ఏదైనా సాధించేలా చేస్తుందన్నారు మంత్రి జూపల్లి.
Read Also: India Armenia: ఆర్మేనియాకు భారత “ఆకాష్ మిస్సైల్స్” .. టర్కీ, అజర్‌బైజాన్‌కి మూడింది..
ఇక, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నూతన క్రీడా విధానంపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని స్థాపిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ చొరవ మహిళల సాధికారతకు దారితీస్తుంది.. పిల్లలు క్రీడలను వృత్తిగా ఎంచుకునేలా ప్రోత్సహిస్తుందని కృష్ణారావు పేర్కొన్నారు.
Read Also: Thug life : కమల్ హాసన్ ’థగ్ లైఫ్’ తెలుగు ట్రైలర్ రిలీజ్..
మరోవైపు, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వేదికకు పరిచయం చేయడం జరిగిందని మంత్రి జూపల్లి తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా చేశాం.. అద్భుతమైన పర్యాటక ప్రదేశాలను ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో మిస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కొత్త ప్రదేశాలను సందర్శించడం కేవలం విలాసం, విశ్రాంతి సాధనం కాదు.. మరో సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవడం అన్నారు. అలాగే, కొత్త వంటకాలను రుచి చూడటం, ఈ జ్ఞాపకాలను పదిలంగా గుర్తుంచుకోవడానికి పర్యాటకం దోహదపడుతుందని చెప్పారు. పర్యాటకం అనేది ప్రజల మధ్య బంధాలను నిర్మించే వంతెన లాంటిదని మంత్రి జూపల్లి తెలిపారు.
