Site icon NTV Telugu

Hyderabad: బైక్‌ పై ముద్దులతో హద్దులు దాటారు.. పోలీసుల చేతికి చిక్కారు..

Hyderabad Crime News Bike Case

Hyderabad Crime News Bike Case

Hyderabad: బైక్‌ పై ముద్దులతో హద్దులు దాటిన ఇద్దరు యువ జంటను మూడు రోజుల వ్యవధిలో పోలీసులు పట్టుకున్నారు. బైక్‌ నడుపుతున్న యువకుడు మహ్మద్‌ వాసిఫ్ అర్షద్ కాగా అతనిపై కూర్చున్న యువతి భానుగా పోలీసులు గుర్తించారు. పహాడి షరీఫ్ రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద వాహనదారులకు ఈ యువ జంట కనిపించారు. దీంతో వాహనదారులు వీరిద్దరిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ ఘటన ఈనెల 22న వెలుగులోకి రావడంతో స్థానిక ప్రజలు మండిపడ్డారు. వాహనంపై వెళ్తూ బైక్ పై ముద్దులు పెట్టుకుంటూ వికృత చేష్టలు చేస్తున్నారని.. ఇలాంటి వారిపై పోలీసులు దృష్టి పెట్టి కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియా ద్వారా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సోషల్ మీడియాలోని వీడియోను పరిశీలించి బైక్‌ నెంబర్‌ ఆధారంగా వారిని గుర్తించారు. గచ్చిబౌలిలోని అర్షద్ తోపాటు యువతిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరిని పట్టుకొని కేసులను నమోదు చేశారు.

Read also: President Droupadi Murmu: రేపు రాష్ట్రానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ట్రాఫిక్ ఆంక్షలు

ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇవ్వడమే కాకుండా.. నోటీసులు సర్వ్ చేసి పంపించారు. ఇలా నడిరోడ్డుపై వికృత చేష్టలు చేస్తే నోటీసులతో సరిపెట్టమని మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. రోడ్డుపై ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. బైక్‌ లపై ఇలాంటి వికృత చేష్టలు చేసి యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని, ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవద్దని సూచించారు. ఇప్పటికైనా యువత మారి మంచి భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని అన్నారు. ఇలాంటి అసహ్యకరమైన చేష్టలు చేస్తూ బైక్‌ లపై ప్రయాణించడమే కాకుండా.. ప్రయాణికులకు, ట్రాఫిక్‌ కు ఇబ్బంది కలిగిస్తే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. పోలీసులు చేసిన పనికి స్థానికులు సభాష్‌ పోలీస్‌ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ ఘటన జరిగిన కొద్దిరోజుల్లోనే పోలీసులు స్పందించి వారిపై చర్యలు తీసుకున్నందుకు పోలీసులకు సెల్యూట్‌ అంటూ ఇమోజీని పెడుతూ కమెంట్లు చేస్తున్నారు.
Ponnam Prabhakar: ప్రవాసి ప్రజావాణి ప్రత్యేక కౌంటర్.. మొదటి అభ్యర్థన స్వీకరించిన మంత్రి పొన్నం

Exit mobile version