Site icon NTV Telugu

Eric Garcetti: ఇరానీ చాయ్ టేస్ట్ చూసిన అమెరికా రాయబారి.. హైదరాబాద్ అంటేనే చార్మినార్ అని ప్రశంసలు

Eric Garcetti

Eric Garcetti

Eric Garcetti: భారతదేశానికి కొత్తగా నియమితులైన అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి హైదరాబాద్ నగరాన్ని ఆస్వాదిస్తున్నారు. తొలిసారిగా హైదరాబాద్ వచ్చిన ఎరిక్ హైదరాబాద్ అభివృద్ధిపై ప్రశంసలు కురిపించారు. తాజాగా హైదరాబాద్ ఐకానిక్ చార్మినార్ పై ప్రశంసలు కురిపించారు. అంతే కాదు ఓల్డ్ సిటీలో ఇరానీ చాయ్ రుచిని ఆస్వాదించారు. హైదరాబాద్ లో ఫేమస్ నిమ్రా కేఫ్ లో ఇరానీ చాయ్ టేస్ట్ చేశారు. ఇరానీ చాయ్ తో పాటు ఉస్మానియా బిస్కెట్లను టేస్ట్ చేస్తూ.. వెనకాల చార్మినార్ ఉన్న ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు.

హైదరాబాద్ ను చార్మినార్ లాగా ఏదీ సూచించదు.. ఇది తెలంగాణ స్మారక చిహ్నాన్ని చూడటం సులభం. 500 ఏళ్ల హిస్టరీ, ఓల్డ్ సిటి అందాలు, ఇది చారిత్రాత్మక నగారానికి ఉత్కంఠభరితమైన నిదర్శనమని, చాయ్ బాగుందని అని ట్వీట్ చేశారు. ఇటీవల ఎరిక్ గార్సెట్టి భారత్ కు అమెరికా 26వ రాయబారిగా నియమితులయ్యారు.

Read Also: Supreme Court: కోర్టులు నైతికత, నీతిని బోధించే స్థలం కాదు.. మహిళ అక్రమసంబంధం కేసులో కీలక వ్యాఖ్యలు..

దీనిపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఆయన సందర్శించాడానికి హైదరాబాద్ లో మరిన్ని స్థలాలను సూచించారు. ‘‘సాయంత్రం చాయ్ అండ్ బిస్కెట్, భోజనానికి ప్యారడైస్ బిర్యానీ, చల్లని బీర్ తో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో తెలుగు సినిమా చూస్తున్నారు.. చక్కని వినోదం’’ అని కామెంట్ చేశారు. మరొకరు భారతదేశం మిమ్మల్ని ఎంతో ఆప్యాయంగా చూస్తుందని రాశారు.

అమెరికా 247వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా హైదరాబాద్ లోని యూఎస్ కాన్సులేట్ ను ఒక రోజు ముందు ఆయన ప్రారంభించారు. రాయబారిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆయన హైదరాబాద్ లో పర్యటించారు. చార్మినార్ తర్వాత, చౌమహల్లా ప్యాలెస్ ను కూడా సందర్శించారు. టిహబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇలా పలు ప్రాంతాల్లో పర్యటించారు. లాస్ ఏంజిల్స్ సిటీ కౌన్సిల్‌లో 12 సంవత్సరాలు పనిచేసిన తర్వాత, రాయబారి గార్సెట్టి 2013లో జరిగిన ఎన్నికలలో అతి పిన్న వయస్కుడిగా గెలుపొందారు. మేడ11, 2023న ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ద్వారా భారతదేశంలో 26వ US రాయబారిగా నియమితులయ్యారు.

Exit mobile version