Site icon NTV Telugu

Kishan Reddy: ప్రధాని మోడీని కులం పేరుతో దూషించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది..

Kishanreddy

Kishanreddy

Kishan Reddy: ప్రధాని మోడీ నేతృత్వంలో క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. త్వరలో జరగబోయే జనగణనలో కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.. ప్రధానికి హృదయపూర్వక ధన్యవాదాలు.. దేశంలో సానుకూలమైన మార్పుకు, కులగణన.. చరిత్రాత్మకమైన కులగణన, చరిత్ర పుటల్లో నిలిచిపోనుంది అన్నారు. ప్రతిపక్ష పార్టీలు నాటకాలకు తెరలేపుతున్నారు.. కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి, కుట్రలు కుతంత్రాలు చేస్తోందని ఆరోపించారు. అలాగే, ముస్లింలను తీసుకెళ్లి బీసీల్లో చేర్చడం దారణం.. కాంగ్రెస్ అన్ని తప్పుడు నిర్ణయాలు చేసింది.. కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ రాష్ట్రపతుల అభ్యర్థిత్వాలను వ్యతిరేకించింది అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడి కన్నా ముందు 3 ప్రాంతాల్లో ఉగ్రవాదుల రెక్కీ..

ఇక, మోడీ సర్కార్ ఎన్నో ఏళ్ల పెండింగ్ అంశం ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టుకు తమ వైఖరిని స్పష్టం చేశాక.. వర్గీకరణ అంశంపై కోర్టు కీలక తీర్పు ఇచ్చింది అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మోడీనీ కులం పేరుతో దూషించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అన్నారు. కాంగ్రెస్ మొదటి నుంచి బీసీల పట్ల మొసలి కన్నీరే కార్చింది.. 2018లో మోడీ ప్రధాని అయ్యాక బీసీ కమిషన్ కు రాజ్యంగ బద్దంగా చట్టం చేశారు.. అన్ని వర్గాలకు న్యాయం చేయ్యాలని.. ఆర్థికంగా వెనకబడిన వర్గాల కోసం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది మోడీ ప్రభుత్వం అని కిషన్ రెడ్డి అన్నారు.

Read Also: CM Revanth Reddy: కేసీఆర్ చేసిన అప్పులు కట్టడానికే లక్షా 2 వేల కోట్లు అప్పు తెచ్చినా..

కాగా, మహిళల సాధికారిత కోసం 35 శాతం రిజర్వేషన్లు కల్పించామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ముస్లిం మహిళల కోసం ట్రిపుల్ తలాక్ రద్దు చేసి.. వాళ్లకు న్యాయం చేసింది మోడీ సర్కార్.. 1981 నుంచి 1931 వరకు కులగణన జరిగింది.. ఆ తర్వాత కులగణ జరక్కుండా కాంగ్రెస్ వ్యవహరించింది.. కులగణనకు కాంగ్రెస్ వ్యతిరేకం అని మండిపడ్డారు. మండలి కమీషన్ నివేదికను రాజీవ్ గాంధీ వ్యతిరేకించారు.. 2010లోనే సుష్మాస్వరాజ్ కులగణన అంశాన్ని లేవనెత్తారు.. సామాజికంగా అన్ని వర్గాలకు లబ్ధి జరగాలి అని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా.. దేశ హితం కోసమేనన్నారు. న్యాయ స్థానాలకు తీర్పుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోంది.. మేం చేసే కులగణనలో మతం ప్రాతిపదికన ఏ మతాలను బీసీల్లో చేర్చేది లేదు అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు.

Exit mobile version