Hyderabad Crime: చందానగర్ డ్రగ్స్ కేసు లో ట్విస్ట్ .. నిందితుడు డాక్టర్ కాదా..?
- హైదరాబాద్ లోని చందానగర్ డ్రగ్స్ కేసు లో ట్విస్ట్..
- ఫ్రెండ్ పార్టీకోసం వెళ్లిన వైద్యుడు షాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Crime: హైదరాబాద్ లోని చందానగర్ డ్రగ్స్ కేసు లో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఫ్రెండ్ పార్టీకోసం వెళ్లిన వైద్యుడు షాక్ కు గురైన ఘటన సంచలనంగా మారింది. వైద్యుడి స్నేహితుడు కృష్ణ రాం అనే వ్యక్తి నగరంలో హార్డ్‌వేర్ షాప్ ఓనర్ గా పనిచేస్తున్నాడు. దీపావళి పండుగ సందర్భంగా కృష్ణ రాం స్నేహితులతో పార్టీ ఏర్పాటు చేశాడు. కృష్ణ రాం, తన స్నేహితులు వైద్యుడితో సహా మరో నలుగురు పార్టీకి వచ్చారు. గుల్ మోహరు కాలనీ హౌస్ నెంబర్ 56 లో పార్టీ ఏర్పాటు చేశాడు. అయితే కృష్ణరాం ఇంటికి డాక్టర్ తో సహా అందరూ చేరుకున్నారు. కృష్ణ రాం బాత్రూం కి వెళ్లిన సమయంలో డాక్టర్ తన బ్యాగ్ చూసి నిర్ఘాంత పోయాడు. అందులో డ్రగ్స్ చూసి షాక్ తిన్నాడు. బాత్రూం నుంచి వచ్చిన కృష్ణ రాం తో వైద్యుడు డ్రగ్స్ ఎక్కడికి తీసుకుని వెళుతున్నావ్ అని అడగడంతో ఏపీకి తీసుకుని వెళుతున్నట్లు తెలిపారు. దీంతో కృష్ణ రాం అక్కడున్న స్నేహితులతో ఎంజాయ్ చేస్తుండగా వైద్యుడు వెంటనే తెలంగాణ నార్కోటిక్ ట్రక్స్ బ్యూరో అధికారులకు సమాచారం అందించాడు.
ఆరు మంది కలిసి ఎండీఎంఏ డ్రగ్ తో పార్టీ జరుగుతున్నట్లు సమాచారం రావడంతో నార్కోటిక్ అధికారులు దాడిచేశారు. కృష్ణారామ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోని చందానగర్ పోలీసులకు అప్పగించారు. నిందితుడిది రాజస్తాన్ లోని బగోడ తాలుకా జలోరి జిల్లాకు చెందిన కృష్ణారామ్ రాజస్థాన్ నుండి డ్రగ్స్ తెచ్చి నగరంలో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఘటన స్థలంలో 18 లక్షల విలువ చేసే 150 గ్రాముల MDMA డ్రగ్స్ ను సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకొని చందానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో ఐదుమంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ముందు డాక్టర్ ఇంట్లోనే పార్టీ నిర్వహిస్తున్నాట్లు వచ్చిన కథనాలపై వైద్యుడు స్పందించాడు. తన స్నేహితుడి ఇంట్లో పార్టీ ఉండగా తనే అక్కడి వెళ్ళానని, అక్కడ తన స్నేహితుడి బ్యాగ్ లో డ్రగ్స్ చూసి పోలీసులకు సమాచారం ఇచ్చానని తెలిపాడు. కానీ.. కథనాలు మాత్రం వైద్యుడి పేరుతో వచ్చాయని తెలిపాడు. పోలీసులకు తనే సమాచారం ఇచ్చానని వెల్లడించారు. సరైన సమాచారం లేకుండా ఎలా ప్రచురిస్తారని వైద్యుడు మండిపడ్డారు.
Road Accident: కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. 12 మందికి గాయాలు!
Also Read
- Stree Ride : మహిళల కోసం ‘స్త్రీ రైడ్’.. ఇక డ్రైవర్ కూడా మహిళే..!
- Sanathnagar TIMS : సనత్‌నగర్ టిమ్స్ రెడీ.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం.!
- Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి 'చేప ప్రసాదం' పంపిణీ..
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
తాజావార్తలు
-
Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్‌పై కేసు, ఉద్యోగానికి గుడ్‌బై.!
-
Annamalai: బీజేపీకి రాజీనామా.. 24 గంటల్లోనే అన్నామలైకి అపూర్వ మద్దతు..
-
Trump-Iran: ‘వాస్తవ ప్రపంచంలో జీవించండి’.. ట్రంప్‌కు ఇరాన్ ఘాటు రిప్లై
-
The Earth: భూగర్భ జలాల దోపిడి.. 31.5 అంగుళాలు వంగిన భూమి!
-
CJI Surya Kant: లండన్‌లో సీజేఐ సూర్యకాంత్‌కు అవమానం.. ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై నిరసనలు
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!