NTV Telugu Site icon

కేంద్రం తీరుపై టీఆర్ఎస్ పోరు.. ఊరురా నిరసనలు

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై ఇంకా స్పష్టత నెలకొనడం లేదు. దీంతో ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు నేడు టీఆర్‌ఎస్‌ శ్రేణులు నిరసనలు చేపట్టనున్నాయి. జిల్లాల్లో, నియోజకవర్గాల్లో, మండలాల్లో ఉన్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొనాలని కేసీఆర్‌ కోరారు.

రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టే నిరసనల్లో ఆయా ఎమ్మెల్యేలు పాల్గొనాలని కేసీఆర్‌ సూచించారు. ఈ నేపథ్యంలో ధాన్యం సేకరణలో కేంద్ర తీరుపై ఊరురా టీఆర్‌ఎస్‌ నేతలు నిరసనలు చేపట్టనున్నారు. చావుడప్పు, ర్యాలీలతో కేంద్రం తీరుకు వ్యతిరేకంగా నిరసనలు చేయనున్నారు.