NTV Telugu Site icon

Hyderabad Traffic: హైదరాబాద్‌లో రేపు, ఎల్లుండి ట్రాఫిక్ మళ్లింపు..

Traffic

Traffic

Hyderabad Traffic: హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా మంగళ, బుధవారాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. హైదరాబాద్‌, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున గణేష్‌ విగ్రహాలు హుస్సేన్‌ సాగర్‌ వైపు రానుండటంతో నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయబోతున్నారు. సిటీలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడానికి ప్రజలు సహకరించాలని కోరారు. ప్రధాన మార్గాల్లో విగ్రహాల ఊరేగింపులు వెళ్లేందుకు వీలుగా సాధారణ ట్రాఫిక్‌ పై ఆంక్షలు విధించారు. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని సెప్టెంబర్ 17, 18తేదీల్లో నగర వ్యాప్తంగా ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ వెల్లడించారు.

Read Also: Khairatabad Ganesh: నిమజ్జనానికి సిద్ధమైన ఖైరతాబాద్ గణేశుడు.. భారీగా తరలివస్తున్న భక్తులు..!

ఇక, బాలాపూర్‌ నుంచి గుర్రం చెరువు ట్యాంక్‌పై కట్టమైసమ్మ ఆలయం దగ్గర గణేష్‌ విగ్రహ ఊరేగింపు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోకి ప్రవేశిస్తుందని సీపీ ఆనంద్ తెలిపారు. కాబట్టి, కేశవగిరి, చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్‌ (లెఫ్ట్ టర్నింగ్), ఎంబీఎన్‌ఆర్‌ ఎక్స్‌ రోడ్, ఫలక్‌నుమా రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్, ఆలియాబాద్, చార్మినార్, మదీనా, అఫ్జల్‌గంజ్, మొహంజాయి మార్కెట్, అబిడ్స్‌ ఎక్స్‌ రోడ్, బషీర్‌బాగ్, లిబర్టీ జంక్షన్, ఎన్టీఆర్‌ మార్గ్, పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌లో అంబేడ్కర్‌ విగ్రహం వైపు వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

Read Also: Teja : దర్శకుడు తేజ చేతుల మీదుగా ప్రారంభమైన “ఈగిల్ ఐ సినీ స్టూడియో”

అలాగే, సికింద్రాబాద్‌ నుంచి వచ్చే వినాయక విగ్రహ ఊరేగింపులు సంగీత్‌ థియేటర్, ప్యాట్నీ, ప్యారడైజ్‌ జంక్షన్, ఎంజీ రోడ్డు, కర్బలా మైదాన్, ట్యాంక్‌బండ్‌ మీదుగా నెక్లెస్‌ రోడ్డుకు వెళ్లనున్నాయి. ఇక, చిలకలగూడ కూడలి నుంచి వచ్చే విగ్రహాలు గాంధీ ఆసుపత్రి, ఆర్టీసీ క్రాస్‌ రోడ్, నారాయణగూడ ఫ్లైఓవర్, వై.జంక్షన్, హిమాయత్‌నగర్‌ నుంచి లిబర్టీ వైపు వెళ్తాయని పోలీసులు సూచించారు. దీంతో పాటు ఉప్పల్‌ నుంచి వచ్చే గణేష్ ఊరేగింపులు రామంతాపూర్, శ్రీ రమణ జంక్షన్, ఛే నంబరు, తిలక్‌నగర్, ఓయూ ఎన్‌సీసీ గేట్, విద్యానగర్‌ జంక్షన్, ఫీవర్‌ ఆస్పత్రి, బర్కత్‌పుర జంక్షన్ మీదుగా వెళ్లాలి.. ఆ ఊరేగింపులు నారాయణగూడ వైఎంసీఏ కూడలికి చేరుకొని, ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు నుంచే వచ్చే ఊరేగింపుతో కలవనుంది.

Read Also: Body Builders Fighting: అసలే బాడీ బిల్డర్స్‌.. గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్నారు..!

దీంతో పాటు, దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి వచ్చే గణేష్ విగ్రహాలు ఐఎస్‌ సదన్, సైదాబాద్, చంచల్‌గూడ ఉంచి వచ్చే ఊరేగింపుతో నల్గొండ ఎక్స్‌ రోడ్డులో కలవనుంది అని హైదరాబాద్ నగర పోలీసులు తెలిపారు. ఇక, తార్నాక వైపు వచ్చే విగ్రహాలు ఉస్మానియా విశ్వవిద్యాలయం దూర విద్యాకేంద్రం రోడ్డు, అడిక్‌మెట్‌ వైపు వెళ్లి విద్యానగర్‌ మీదుగా ఫీవర్‌ ఆసుపత్రి వద్దకు చేరుకోనున్నాయి. అలాగే, టోలిచౌకి, రేతిబౌలి, మోహిదీపట్నం వైపు నుంచి వచ్చే గణేష్‌ విగ్రహాలు మాసబ్‌ట్యాంక్, అయోధ్య జంక్షన్, నిరంకారి భవన్, ద్వారకా హోటల్‌ జంక్షన్, ఇక్బాల్‌ మినార్‌ మీదుగా ఎన్టీఆర్‌ మార్గ్‌కు వెళ్లనున్నాయి. ఇక, ఎర్రగడ్డ నుంచి వచ్చే విగ్రహాలు ఎస్‌ఆర్‌ నగర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్‌ మీదుగా మోహిదీపట్నం నుంచి వచ్చే ఊరేగింపు నిరంకారి భవన్‌ వద్ద చేరి, ఎన్టీఆర్‌ మార్గ్‌ వరకు వెళ్లనున్నాయి.

Read Also: Earthquake : కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో భూకంపం.. తీవ్రత 6.5గా నమోదు

అలాగే, టప్పాచబుత్ర, ఆసిఫ్‌నగర్‌ ప్రాంతాల నుంచి వచ్చే గణేష్ విగ్రహాలు సీతారాంబాగ్, బోయిగూడ కమాన్, వోల్గా హోటల్‌ ఎక్స్‌రోడ్, గోషామహల్, మాలకుంట జంక్షన్‌ మీదుగా వెళ్లి ఎంజేఎం దగ్గర ప్రధాన ఊరేగింపులో కలుస్తాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వినాయక విగ్రహాల నిమజ్జనం నేపథ్యంలో సాధారణ ప్రజలు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగవచ్చు.. ఊరేగింపు కొనసాగే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.. ప్రజలు అందుకు అనుగుణంగా తమ ప్రయాణ మార్గాన్ని నిర్దేశించుకోవాలని సీపీ సీవీ ఆనంద్ సూచించారు.

Show comments