ప్రతిభ గల యువ నటీనటులకు శిక్షణ ఇచ్చి అవకాశాలు అందించే ఉద్దేశంతో ఫేమస్ కాస్టింగ్ డైరెక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో “ఈగిల్ ఐ సినీ స్టూడియో” హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు తేజ ఈగిల్ ఐ సినీ స్టూడియోను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఢీ విన్నర్ అక్సాఖాన్, యువ నటి గాయత్రి రమణ, ఈగిల్ ఐ సినీ స్టూడియో ఓనర్, కాస్టింగ్ డైరెక్టర్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా
దర్శకుడు తేజ మాట్లాడుతూ – ప్రసాద్ గారు నాకు చాలా కాలంగా తెలుసు. మా సినిమాలకు కావాల్సిన అన్ని ఏజ్ గ్రూప్స్ నటీనటులను ఇచ్చేవారు. ఆయన మంచి శిక్షణ ఇచ్చి ప్రతిభావంతులను తయారుచేస్తాడు. సినీ పరిశ్రమలో నటీనటులుగా స్థిరపడాలనుకునే వారికి సరైన శిక్షణ అవసరం. ఈగిల్ ఐ సినీ స్టూడియోలో మీకు అవసరమైన అలాంటి శిక్షణ ఇచ్చి అవకాశాలు కూడా చూపిస్తారు. ఈ సంస్థ నుంచి ఎంతోమంది ప్రతిభావంతులైన యువ నటీనటులు ఇండస్ట్రీకి రావాలని కోరుకుంటున్నా. అన్నారు.
ఈగిల్ ఐ సినీ స్టూడియో ఓనర్, కాస్టింగ్ డైరెక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ – ఈ రోజు మా ఈగిల్ ఐ సినీ స్టూడియో ప్రారంభోత్సవానికి అతిథిగా వచ్చి మాకు తన విశెస్ అందించిన డైరెక్టర్ తేజ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. ఆయన మా వెల్ విషర్. తేజ గారి బెస్ట్ విశెస్ తో ఈగిల్ ఐ సినీ స్టూడియోను మంచి రెప్యుటేషన్ ఉన్న సంస్థగా తీర్చిదిద్దుతాం. అన్నారు.
హీరోయిన్ అక్సాఖాన్ మాట్లాడుతూ – దర్శకుడు తేజ గారంటే మాకు ఎంతో ఇష్టం. ఆయన ఎంతోమందిని ఇన్స్ పైర్ చేశారు. ఎన్నో మంచి మూవీస్ చేసి, చాలా మంది కొత్త నటీనటులకు అవకాశాలు ఇచ్చారు. తేజ గారు ఈరోజు ఈగిల్ ఐ సినీ స్టూడియో ప్రారంభోత్సవానికి రావడం సంతోషంగా ఉంది. ఆయన సినిమాలో నటించే అవకాశం నాకు రావాలని వెయిట్ చేస్తున్నా, ప్రసాద్ గారు చాలా మంచి వ్యక్తి. ఆయన ఈగిల్ ఐ సినీ స్టూడియో అందరికీ రీచ్ కావాలి అన్నారు.
Also Read : Raghu Thatha : ‘రఘు తాత’ వచ్చాడే.. అదరిగొట్టి పోతాడే..