NTV Telugu Site icon

Rave Party: గచ్చిబౌలిలో రేవ్ పార్టీని భగ్నం చేసిన పోలీసులు..

Rave Party

Rave Party

Rave Party: హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో రేవ్ పార్టీని ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. వారి నుంచి గంజాయి ప్యాకేట్స్, ఈ సిగరేట్, మద్యం స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీ దగ్గర దొరికిన వారిని మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు. ఈ సందర్భంగా సీఐ ఆంజనేయులు మాట్లాడుతూ.. టీఎన్జీఓ కాలనీలో ఓ అపార్ట్మెంట్ లో పుట్టినరోజు పార్టీలో ఎస్ఓటీ పోలీసులు గంజాయి పట్టుకున్నారు అని తెలిపారు. మొత్తం 18 మంది ఉన్నారు.. అందులో 12 మంది యువకులు, ఆరుగురు అమ్మాయిలు ఉన్నారని చెప్పారు. ఇందులో స్టూడెంట్స్ ఎవరూ లేరు.. అంతా మ్యుచువల్ ఫ్రెండ్స్.. మద్యంతో పాటు గంజాయి సేవిస్తూ బర్త్ డే వేడుకలు చేసుకుందాం అనుకున్నారు.. ఇక్కడ 40 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు.

Read Also: YS Jagan: వైఎస్‌ జగన్‌కు హైకోర్టులో ఊరట..

ఇక, 18 మందిని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు మాకు అప్పగించారు అని సీఐ ఆంజనేయులు తెలిపారు. డ్రగ్ డిటెక్షన్ టెస్ట్ చేయగా.. ప్రదీప్, చరణ్, వరుణ్ అనే ముగ్గురు యువకులకు పాజిటివ్ వచ్చింది.. వరుణ్ అనే యువకుడు గంజాయి కొనుగోలు చేశాడు.. సాయి ఆదిత్య అనే యువకుడిది బర్త్ డే.. అమ్మాయిల్లో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులం అని చెప్తున్నారు.. యువకుల్లో ఇద్దరు రైల్వే కాంట్రాక్ట్ ఉద్యోగులు.. మిగతా వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు అని గచ్చిబౌలి సీఐ ఆంజనేయులు వెల్లడించారు.

Show comments