Arekapudi Gandhi: కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత.. ఇంటి ముందు కూర్చున్న గాంధీ..
- కౌశిక్‌రెడ్డి ఇంటి బయట అరికెపూడి గాంధీ అనుచరుల ధర్నా..
- కౌశిక్‌రెడ్డిపై గుడ్లు- టమాటాలు విసిరిన గాంధీ అనుచరులు..
- కౌశిక్‌రెడ్డి దమ్ముంటే బయటకు రావాలి నేను ఇక్కడే ఉంటా..
Arekapudi Gandhi: హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని సవాల్ విసిరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ ముందే ప్రకటించిన మాదిరిగా తన అనుచరులతో కలిసి కొండాపూర్ లోని కౌశిక్ రెడ్డి ఉంటున్న ప్రాంతానికి వచ్చారు. అయితే గచ్చిబౌలి పోలీసులు గాంధీని అడ్డుకున్నారు. గాంధీని లోపలికి వెళ్లకుండా అడ్డుపడ్డారు. కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా గాంధీ అనుచరులు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ గొడవకు దిగారు. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని వారిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. గోడ దూకి లోపలికి వెళ్లిన గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటిపై, ఆయన పై కోడుగుడ్లు, టమాటాలు, రాళ్లతో దాడికి దిగారు. ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. ఇంట్లో పనిచేసే ఆడవారికి గాయాలు అయ్యాయి. పలువురు మీడియా ప్రతినిధుకు కూడా గాయపడ్డారు. సవాళ్లు, ప్రతి సవాళ్ళతో కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద భీకర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కోడిగుడ్లు, టమాటాలు, రాళ్లతో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు పలుమార్లు అడ్డుకున్నప్పటికీ ఒక్కరు కూడా వెనక్కి తగ్గలేదు. ఎవరికి వారు తమ ప్రతాపం చూపించారు. దీంతో కౌశిక్ రెడ్డి ఇంటి ముందు ఎక్కడ చూసినా పగిలిన కోడిగుడ్లు, టమాటాలు దర్శనమిచ్చాయి. అయితే కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద గాంధీ ధర్నాకు కూర్చున్నారు. కౌశిక్‌రెడ్డి దమ్ముంటే బయటకు రావాలి నేను ఇక్కడే ఉంటా అంటూ గాంధీ సవాల్ చేశారు. దీంతో పరిస్థితులను అదుపు చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు.
Also Read
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్‌ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్‌మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!