Telangana: కొందరు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సరైన పత్రాలు, ఫిట్ నెస్ లేని వాహనాలను వినియోగిస్తున్నారు. దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాంటి వాహనాలపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ 50 రోజుల వ్యవధిలో 900 వాహనాలను అధికారులు సీజ్ చేశారు. సరైన పత్రాలు, ఫిట్‌నెస్ లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఈ 50 రోజుల వ్యవధిలో 936 బస్సులకు పైగా సీజ్ చేస్తే హైదరాబాద్‌లో 63 వాహనాలు ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలకు జరిమానాలు విధించారు. ఈ వాహనాల నుంచి ప్రభుత్వానికి రూ. 8.72 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇది కాకుండా కాంపౌండబుల్ ఫీజుగా మరో 9.65 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
Read also: Leeds Riots: బ్రిటన్‌లోని లీడ్స్‌లో అల్లర్లు.. పోలీసు వాహనాల ధ్వంసం..!
నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలు చాలా వరకు మహానగరంలోనే ఉన్నాయని చెబుతున్నారు. 63 బస్సులకు లక్షన్నర జరిమానా విధించినట్లు తెలిపారు. అలాగే మేడ్చల్ మల్కాజ్ గిరి ప్రాంతాల్లో జరిమానాల రూపంలో మరో కోటిన్నర ఆదాయం వచ్చినట్లు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. కేవలం ఒకటిన్నర రోజుల్లోనే 8 కోట్లకు పైగా వాహనాలు జరిమానాల రూపంలో రావడం గమనార్హం. స్కూల్ బస్సుల నుంచి కూడా కోట్లలో వసూలు చేశారు. పాఠశాలల యాజమాన్యాలు పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నాయనడానికి ఇదో ఉదాహరణ. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. రానున్న రోజుల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులను పరీక్షించి సర్టిఫికెట్ ఇస్తేనే రోడ్డుపై నడపాలని రవాణాశాఖ అధికారులు తెలిపారు.
Top Headlines @ 9 AM: టాప్ న్యూస్