Site icon NTV Telugu

Gali Janardhan Reddy: గాలి జనార్దన్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట

Gali Janardhan Reddy

Gali Janardhan Reddy

తెలంగాణ హైకోర్టులో గాలి జనార్దన్‌రెడ్డికి భారీ ఊరట లభించింది. సీబీఐ కోర్టు తీర్పును న్యాయస్థానం సస్పెండ్ చేసింది. ఓబుళాపురం అక్రమ మైనింగ్‌ కేసులో సీబీఐ కోర్టు విధించిన శిక్షను ధర్మాసనం తాజాగా నిలుపుదల చేసింది. దీంతో ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. రూ. 10 లక్షల రెండు షూరిటీలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. దేశం విడిచి వెళ్లవద్దని.. పాస్‌పోర్టును సరెండర్‌ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.

ఇది కూడా చదవండి: KCR Convoy: కేసీఆర్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం.. పాక్షికంగా ధ్వంసమైన రెండు కార్లు..!

ప్రస్తుతం ఓబుళాపురం అక్రమ మైనింగ్‌ కేసులో గాలి జనార్దన్‌ రెడ్డి శిక్ష అనుభవిస్తున్నారు. చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. ఓఎంసీ కేసులో ఏ2గా ఉన్న గాలి జనార్దన్‌ రెడ్డికి గత నెలలో ఏడేళ్లు జైలు శిక్ష పడడంతో చంచల్‌గూడ జైలులో ఉన్నారు. అయితే సీబీఐ కోర్టు విధించిన శిక్షను సస్పెండ్‌‌‌‌ చేయాలంటూ కర్ణాటక ఎమ్మెల్యే గాలి జనార్దన్‌‌‌‌రెడ్డి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌‌‌‌పై హైకోర్టులో మంగళవారం వాదనలు ముగిశాయి. బుధవారం తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ కె.లక్ష్మణ్‌‌‌‌ వెల్లడించారు. తాజాగా గాలి జనార్దన్‌రెడ్డికి ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది.

ఇది కూడా చదవండి: Sonam Raghuwanshi: రాజాను పెళ్లి చేసుకోను.. ప్రియుడితోనే ఉంటాను.. తల్లిని హెచ్చరించిన సోనమ్

Exit mobile version