GHMC : ఆస్తి పన్నుపై తెలంగాణ బిగ్ రిలీఫ్.. 100% వడ్డీ మాఫీ.!
- ప్రభుత్వ ఆస్తుల బకాయిలపై తెలంగాణ కీలక నిర్ణయం
- 2,217 ఆస్తులకు ఓటీఎస్ స్కీమ్ అమలు
- వడ్డీ, పెనాల్టీలకు పూర్తి మాఫీ.. అసలు పన్నే చెల్లింపు
- జీహెచ్ఎంసీకి భారీ ఆదాయం.. వేగం పుంజుకోనున్న అభివృద్ధి పనులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగర పరిధిలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ ఆస్తులపై సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ (ఆస్తి పన్ను) బకాయిల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలు భారీగా పేరుకుపోవడంతో మున్సిపల్ కార్పొరేషన్ల ఆర్థిక పరిస్థితిపై పడుతున్న ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ అడుగు వేసింది. ఇందులో భాగంగానే, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ వివాదానికి ముగింపు పలుకుతూ ప్రభుత్వం ప్రత్యేక ‘వన్ టైమ్ సెటిల్మెంట్’ (OTS) విధానాన్ని ప్రకటించింది.
నగర పరిధిలోని మొత్తం 2,217 ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి ఇప్పటివరకు అసలు పన్ను , దానికి తోడైన భారీ వడ్డీ, జరిమానాలు (పెనాల్టీలు) కలిపి సుమారు ₹5,864 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. అయితే, తాజా ఓటీఎస్ (OTS) మార్గదర్శకాల ప్రకారం.. ఈ బకాయిలపై ఉన్న వడ్డీ , పెనాల్టీలను ప్రభుత్వం 100 శాతం పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ భారీ వడ్డీ మాఫీ నిర్ణయం వల్ల వందల కోట్ల అదనపు భారం తప్పుతుంది. ఇకపై సంబంధిత ప్రభుత్వ శాఖలు లేదా సంస్థలు కేవలం తమ అసలు పన్ను మొత్తమైన ₹1,686.39 కోట్లను మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని ప్రభుత్వం స్పష్టం చేస్తూ ఇందుకు అధికారికంగా ఆమోదం తెలిపింది.
Also Read
- Minister Seethakka : ఎల్ నీనో ఎఫెక్ట్‌పై సీతక్క అలర్ట్.. తెలంగాణలో తాగునీటి కొరతకు నో ఛాన్స్
- Thatikonda Rajaiah : కడియం శ్రీహరి సొల్లు పురాణం చెబుతున్నారు
- Ponnam Prabhakar: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి యువత పోరాట విజయం
- NIMS Hyderabad : నిమ్స్‌లో వైద్య రంగానికి మైలురాయి.. 2 గంటల్లోనే బ్రెయిన్ సర్జరీలు
రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో సంవత్సరాలుగా ఫైళ్లలోనే మురిగిపోతున్న ఆస్తి పన్ను బకాయిలు ఒకేసారి క్లియర్ కానున్నాయి. దీని ద్వారా జీహెచ్ఎంసీ (GHMC) తో పాటు నగర పరిధిలోని ఇతర మున్సిపల్ సంస్థలకు వందల కోట్ల రూపాయల రాబడి తక్షణమే అందనుంది. ఈ నిధుల రాకతో నగరంలో నిలిచిపోయిన పలు అభివృద్ధి పనులను, మౌలిక సదుపాయాల కల్పనను మరింత వేగవంతం చేసేందుకు మున్సిపల్ అధికారులకు వీలు కలుగుతుంది.
తాజావార్తలు
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
VVS Laxman: గౌతమ్ గంభీర్ విరామం.. భారత డ్రెస్సింగ్ రూమ్ స్వరూపాన్నే మార్చేసిన వివిఎస్ లక్ష్మణ్..
-
Sharad Pawar: “మోడీ నా మాట విన్నారు”.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనక శరద్ పవార్..
-
IND Vs ZIM: తిలక్ వర్మ వీరవిహారం.. టీమిండియా భారీ స్కోర్..
-
CJP Protest: 3 డిమాండ్లు కేంద్రం అంగీకరించింది.. ఆందోళన విరమించినట్లుగా సీజేపీ ప్రకటన
ట్రెండింగ్
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!