Telangana Assembly: 23 నుంచి అసెంబ్లీ భేటీ.. 25న బడ్జెట్..
- ఈ నెల 23న రాష్ట్ర శాసనసభ మూడో సమావేశాలు ..
- 24వ తేదీ మరుసటి రోజు ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు..
- 25న ఉభయ సభల్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Assembly: రాష్ట్ర శాసనసభ మూడో సమావేశాలు ఈ నెల 23న ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. 24వ తేదీ మరుసటి రోజు ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ తరఫున అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నరసింహాచార్య గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 23న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు మొదటి వారం వరకు కొనసాగే అవకాశం ఉంది. దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత, ఇటీవల మృతి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలిపి సభ తొలిరోజు వాయిదా పడింది. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఈ ఏడాది ఫిబ్రవరి 23న రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నెల 24న శాసనసభ, శాసనమండలి వేర్వేరుగా సమావేశమై సాధారణ కార్యకలాపాలను చేపట్టే అవకాశం ఉంది.
Read also: Virat Kohli-BCCI: ఎలాంటి అపోహలు వద్దు.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ భరోసా!
Also Read
- Bhatti Vikramarka : ప్రాణహిత-చేవెళ్ల కడదామా? వద్దా? బీజేపీ సమాధానం చెప్పాలి
- Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
- Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
- Danam Nagender : దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు
అలాగే రాష్ట్ర వార్షిక (2024-25) బడ్జెట్‌ను ప్రభుత్వం 25న ఉభయ సభల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 26న అసెంబ్లీ సమావేశాలు వాయిదా, 27న బడ్జెట్ ప్రసంగంపై చర్చ జరగనుంది. బోనాల పండుగ నేపథ్యంలో 28, 29 తేదీల్లో మళ్లీ సభ వాయిదా పడి ఈ నెల 30 నుంచి మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఈ నెల 23న స్పీకర్ అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో సభ ఎజెండా, ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. కాగా.. గత అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ డుమ్మా కొట్టారు. కానీ, తాజాగా ఆయన ఈసారి సమావేశాలకు హాజరవుతానని ప్రకటించడంతో రానున్న సమావేశాలపై ఆసక్తి నెలకొంది. దాదాపు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వలసలు ఎక్కువగా ఉంటాయని చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో విపక్ష బీఆర్ఎస్ ఫిరాయింపు చట్టంపై అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం ఉంది.
Rajanna Sircilla: మమ్మల్ని వదిలి వెళ్లకండి సార్.. వెక్కి వెక్కి ఏడ్చిన విద్యార్థులు..
తాజావార్తలు
-
OTR: ఏపీలో పదే పదే రిక్రూట్మెంట్ జీవోల విషయంలో తడబాట్లు..
-
Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
-
Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
-
Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..
-
The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..