Telangana Assembly Live 2024: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు హాట్ హాట్గా సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్- బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అసెంబ్లీలో భూభారతి బిల్లును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రవేశ పెట్టారు. బిల్లుపై ప్రిపేర్ అయ్యేందుకు సమయం కావాలని కోరిన విపక్షాలు.. ఎన్టీవీ లైవ్ అప్ డేట్స్ మీ కోసం..
-
వెనుకబడిన వర్గాలకు గురుకులాలే ముఖ్యం-మంత్రి సీతక్క
గురుకులాలను బాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలకు గురుకులాలే ముఖ్యమని ఆమె వెల్లడించారు. డైట్ , కాస్మొటిక్ చార్జీలను సీఎం పెంచారన్నారు. ట్రైబల్ నుంచి వచ్చిన స్టూడెంట్‌గా సీఎంకు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. ఆహార భద్రత కమిటీలు ఏర్పాటు చేశారని.. కొత్త డైట్ తో మొన్న సీఎం, మంత్రులు లంచ్ చేశారన్నారు. దీనిని అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చామని.. లేకపోతే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
దేశంలోనే మొదటిసారి కిచెన్ ఫ్లోర్ నిర్వహణ, క్వాలిటీ సరుకులు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ క్యాంపస్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. యంగ్ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. అన్ని గురుకులాలు ఒకే చోట ఏర్పాటు చేస్తున్నామన్నారు. రూ. 2500 కోట్ల ఖర్చుతో 54 గురుకులాలను ఈ ఏడాది మంజూరు చేశామన్నారు.
మౌలిక వసతులు బాగు చేస్తున్నామన్నారు. అమ్మ ఆదర్శ కమిటీ బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించామన్నారు. తాగు నీరు, టాయిలెట్స్, బిల్డింగ్ మరమ్మతులు చేపడుతున్నామన్నారు. పాఠశాల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 14 వేల స్కూల్స్ అభివృద్ధి చేశామని.. రూ.657 కోట్లు ఖర్చు చేశామని మంత్రి సీతక్క వెల్లడించారు.
-
అధికార, ప్రతిపక్షం మధ్య మాటల దాడి
గురుకులాలపై స్వల్పకాలిక చర్చలో అధికార, ప్రతిపక్షం మధ్య మాటల దాడి జరిగింది
-
స్పీకర్‌ను కలవనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
మరికొద్దిసేపట్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలవనున్నారు. ఫార్ములా-ఈ రేసింగ్‌పై సభలో చర్చించాలని స్పీకర్‌ను కోరనున్నారు.
-
భూభారతి చట్టంపై రేపు అసెంబ్లీలో చర్చ
భూభారతి చట్టంపై రేపు తెలంగాణ అసెంబ్లీలో చర్చ.. ప్రతిపక్ష సభ్యుల సూచనలతో భూ భారతిపై చర్చ కొనసాగనుంది.
-
శాసన సభ వాయిదా..
తెలంగాణ శాసన సభ మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా..
-
ఆ భూములను స్వాధీనం చేసుకుంటాం..
అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్
-
శాసనమండలి వాయిదా..
తెలంగాణ శాసన మండలి మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా..
-
సరైన బిల్లు తీసుకురావడానికి కాస్త ఆలస్యమైంది..
సరైన బిల్లు తీసుకురావాలన్న ప్రయత్నంతోనే కాస్త ఆలస్యమైంది.. భూములున్న ప్రతి ఒక్కరికీ పూర్తి భద్రత కల్పించేలా కొత్త చట్టం.. తెలంగాణలోని ప్రతి ఎకరాకు భద్రత కల్పించాలి: పొంగులేటి
-
కొత్త చట్టంలో దాపరికం ఉండదు..
ప్రపంచంలో ఏమూల ఉన్నా సరే.. కొత్త చట్టం ద్వారా సర్వే నంబర్ క్లిక్ చేస్తే.. పూర్తి వివరాలు వచ్చేస్తాయి.. కొత్త చట్టంలో ఏదీ దాపరికం ఉండదు: మంత్రి పొంగులేటి
-
ఒక్క సంతకంతో రెవెన్యూ వ్యవస్థను కుప్పకూల్చారు..
సాదా బైనామాలపై గత చట్టంలో ఎలాంటి క్లాజు పొందు పర్చలేదు.. సాదాబైనామాల వివాదం అలాగే పెండింగ్ లో ఉంది.. నవంబర్ 2010 వరకు ఉన్న అర్హమైన అప్లికేషన్లను క్లియర్ చేస్తాం.. అభ్యంతరాలుంటే రెండు దశల్లో వాటిని లేవనెత్తవచ్చు.. మనిషికి ఆధార్ లాగానే భూములకు భూధార్.. ప్రతి ఏటా రెవెన్యూ గ్రామాల్లో జమాబందీ జరిగేది.. 2020 చట్టం తర్వాత దాన్ని పూర్తిగా ఎత్తివేశారు.. అర్థరాత్రి ఒక్క సంతకంతో రెవెన్యూ వ్యవస్థను కుప్పకూల్చారు: మంత్రి పొంగులేటి
-
మీరు తయారు చేసిన రూల్ బుక్ మీరే ఫాలో కావడం లేదు..
మేం రూల్ బుక్ ప్రకారమే వెళ్తున్నాం.. మీరు తయారు చేసిన రూల్ బుక్ మీరే ఫాలో కావడం లేదు.. ఇక్కడ కూర్చున్న.. అక్కడ కూర్చున్నా మేం చెప్పినట్లే నడవాలి అంటే ఎలా: మంత్రి శ్రీధర్ బాబు
-
బిల్లుపై ఆధ్యాయనం చేసేందుకు సమయం కావాలి..
భూభారతి బిల్లును అధ్యయనం చేసేందుకు మాకు సమయం కావాలని అడిగిన బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ.. సభ్యుల సూచనలు చేస్తే పరిగణలోకి తీసుకుంటాం.. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటాం: మంత్రి శ్రీధర్ బాబు
-
ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం..
అద్భుతమైన చట్టాన్ని తీసుకొచ్చామని అప్పట్లో కేసీఆర్ చెప్పుకున్నారు.. మాకు ఆలోచన లేదంటూ మాపై విమర్శలు గుప్పించారు.. ధరణితో చదువుల, పెళ్లిళ్లకు కూడా తమ భూములు అమ్ముకోలేక ఇబ్బందులు పడ్డారు.. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని ఎన్నికల సమయంలో చెప్పాం: మంత్రి పొంగులేటి
-
ధరణితో లక్షలాది మంది ఇబ్బంది పడ్డారు..
పలు రాష్ట్రాల్లో ఆర్వోఆర్ చట్టాలను పరిశీలించి ఈ చట్టాన్ని తీసుకొచ్చాం.. లక్షలాది మంది ధరణితో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. ధరణిని అర్థరాత్రి ప్రమోట్ చేశారు.. నాలుగు నెలలు వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి.. 2 నెలలు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి: మంత్రి పొంగులేటి
-
బిల్లుపై ప్రిపేర్ కావడానికి టైం ఇవ్వండి..
భూభారతి బిల్లు మా చేతికి రాకముందే చర్చ అంటే ఎలా.. బిల్లుపై ప్రిపేర్ కావడానికి టైమ్ ఇవ్వాలి: హరీశ్ రావు
-
కొత్తగా భూభారతి చట్టాన్ని తెస్తున్నాం..
లోపభూయిష్టమైన ఆర్వోఆర్ చట్టం-2020ను కూడా పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నాం.. కొత్తగా భూభారతి చట్టాన్ని తీసుకొస్తున్నాం: మంత్రి పొంగులేటి
-
ధరణితో ఎన్నో సమస్యలు
ధరణితో ఎన్నో సమస్యలు తలెత్తాయి.. రెవెన్యూ అధికారుల దగ్గర పరిష్కారం కావలసినవి కూడా కోర్టులకు చేరాయి.. భూ యజమానికి తెలియకుండానే భూమి చేయి దాటిపోయింది.. పేదల ఆవేదన చెప్పుకోవడానికి కూడా మార్గం లేకుండా పోయింది: మంత్రి పొంగులేటి
-
సభలోకి భూభారతి బిల్లు..
భూభారతి బిల్లును సభలో ప్రవేశ పెట్టిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. కాంగ్రెస్ అంటేనే ప్రజలకు భద్రత, భరోసా: పొంగులేటి
-
అసెంబ్లీలో గందరగోళం
తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం.. సభలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు.. సభ్యులు కొంతమంది తాగి సభకు వస్తున్నారన్న హరీశ్ రావు.. డ్రంగ్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయాలన్న హరీశ్.. హరీశ్ రావు వ్యా్ఖ్యలపై మండిపడ్డ అధికార పార్టీ ఎమ్మెల్యేలు..
-
కోమటిరెడ్డి తీరు సరిగ్గా లేదు..
మంత్రి కోమటిరెడ్డి తీరు సరిగ్గా లేదు.. మీ మంత్రులు తప్పు చేసినా శ్రీధర్ బాబు సరిదిద్దాలి: హరీశ్ రావు
-
అసెంబ్లీలో బీఆర్ఎస్ నిరసన
మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన..
-
హాట్ హాట్ గా అసెంబ్లీ సమావేశాలు..
హాట్ హాట్ గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. రోడ్లపై కాంగ్రెస్- బీఆర్ఎస్ మధ్య వాగ్వాదం..
-
కేసీఆర్ ఫాంహౌస్ కి రూ. 700 కోట్లతో రోడ్లు వేసుకున్నారు..
బీఆర్ఎస్ కు రోడ్ల మీద ఐడియా లేదు.. ఎంత సేపు పైసలు వచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తప్పా ఇంకా ఏం తెలియదు.. మాజీ సీఎం ఫాం హౌస్ కి వెళ్లే రోడ్డును 6 రూట్లలో రూ. 700 కోట్లతో ఎక్స్ ప్రెస్ హైవే వేసుకున్నాడు.. ఏడేళ్లైనా ఉప్పల్ డబుల్ రోడ్లు ఎందుకు పూర్తి కాలేదు- మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
-
ఆటో కార్మికుల డ్రెస్ లో మండలికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు..
ఆటో కార్మికుల డ్రెస్ లో శాసన మండలికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. ప్లకార్డులతో శాసనమండలి లోపలికి వెళ్లేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల యత్నం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నుంచి ప్లకార్డులు లాక్కున్న పోలీసులు, మార్షల్స్..
-
బీఆర్ఎస్ నిందలు మోపేముందు ఆలోచించాలి..
బీఆర్ఎస్ వాళ్లు నిందలు మోపేముందు ఆలోచించండి.. ఆటో ట్యాక్సీలు పెంచి, అనుమతులు ఇవ్వండి మీరు.. ఇప్పుడు ధర్నాలు చేస్తుంది మీరు.. ఇదేం పద్దతి- మంత్రి శ్రీధర్ బాబు
-
అవన్నీ బీఆర్ఎస్ డ్రామాలే..
ఆటో కార్మికుల డ్రెస్, బేడీలతో నిరసన అనేది బీఆర్ఎస్ రాజకీయ డ్రామా: మంత్రి పొన్నం ప్రభాకర్
-
మొత్తం దోచుకున్నది మీరే..
మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఈ- ఫార్ములా రేసింగ్ ల్లో.. కమిషన్లు దోచుకున్నది మీరే.. కమిషన్లతో వేల కోట్లు దోచుకుంది మీరు- అది శ్రీనివాస్
-
అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం
తెలంగాణ అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం.. ఓవర్సీస్ స్కాలర్ షిప్స్ విషయంలో వివాదం.. 10 పర్సంట్ అంటూ ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద.. వివేకానంద వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం.. వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేసిన మంత్రి శ్రీధర్ బాబు.. వివేకా వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించిన స్పీకర్..
-
బీఆర్ఎస్ పై స్పీకర్ సీరియస్
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఆగ్రహం.. సభను ఇలా డిస్టర్బ్ చేయడం సరికాదన్న స్పీకర్..