NTV Telugu Site icon

Telangana Assembly: నిన్నటిలా సుదీర్ఘ ప్రసంగాలు చేయవద్దు.. సభ్యులకు స్పీకర్ విజ్ఞప్తి..

Telangana Assembly

Telangana Assembly

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు ప్రారంభమయ్యాయి. ఈరోజు మరో 19 పద్దులపై చర్చ కొనసాగుతుంది. నిన్న (సోమవారం) ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమైంది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల వరకు సమావేశం కొనసాగింది. ఈ నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభ్యులకు కీలక సందేశం ఇచ్చారు. నిన్నటిలా సుదీర్ఘ ప్రసంగాలు చేయవద్దని స్పీకర్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఒక్కో సభ్యునికి 15 నిమిషాల సమయం కేటాయిస్తారు. అనే అంశంపై మాట్లాడాలని సభ్యులందరూ సభ్యులకు సూచించారు.

Read also: Charminar Clock: 135 ఏళ్ల ఘన చరిత్ర.. చారిత్రాత్మక చార్మినార్ గడియారం ధ్వంసం..

కాగా..ఈరోజు కూడా శాసనసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలయ్యాయి. నేడు సభ ముందుకు స్కిల్ యూనివర్సిటీ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లును మంత్రి శ్రీధర్‌బాబు సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశంలో తొమ్మిది శాఖల సమస్యలపై చర్చించనున్నారు. మత్స్యశాఖ, క్రీడలు, యువజన సర్వీసు, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మైనార్టీ సంక్షేమంపై నేడు చర్చ జరగనుంది. సాగునీరు, పౌర సరఫరాల సమస్యలపై శాసనసభలో చర్చ జరగనుంది. వ్యవసాయ శాఖ, పర్యాటక శాఖ సమస్యలపై శాసనసభలో చర్చ జరగనుంది. దేవాదాయ, అటవీ శాఖల సమస్యలపై శాసనసభ సభ్యులు చర్చించనున్నారు. రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మాతా శిశు సంక్షేమంపై సభలో చర్చించనున్నారు.
Credit Card New Rules :హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్ హోల్డర్‌ బ్యాడ్ న్యూస్..ఆగస్టు నుంచి అదనపు ఛార్జీలు

Show comments