NTV Telugu Site icon

Telangana Assembly Live 2024: అసెంబ్లీ సమావేశాలు లైవ్..

Telangana Assembly 2024

Telangana Assembly 2024

Telangana Assembly Live 2024: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు పలు బిల్లులపై సభలో చర్చ జరగనుంది. ముందుగా ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కొమిరెడ్డి జ్యోతి, ఊకే అబ్బయ్య, రామచంద్రారెడ్డిలకు సభ సంతాపం తెలియజేశారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న నూతన పర్యాటక విధానంపై చర్చ ప్రారంభమైంది. అదేవిధంగా బెల్ట్ షాపులు, పెండింగ్ బిల్లులు, టీజీఐఐసీ పార్కుల మూసివేతపై ప్రభుత్వం తరఫున సభ్యులు సూచనలు ఇవ్వనున్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ సవరణ బిల్లులను సభలో ప్రవేశపెడతారు.

The liveblog has ended.
  • 16 Dec 2024 02:59 PM (IST)

    అసెంబ్లీ రేపటికి వాయిదా

    తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఇదిలా ఉండగా.. అసెంబ్లీ లాబీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ఎమ్మెల్యేల ప్రవేశ ద్వారం దగ్గర ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు.

  • 16 Dec 2024 02:36 PM (IST)

    ఇదేం రాజ్యం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు.

    సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ఇదేం రాజ్యం అంటూ బీఆర్ఎస్ నిరసనల మధ్య సభను ప్రభుత్వం కొనసాగిస్తుంది. లగచర్ల రైతులకు బేడీ ల విషయంలో చర్చ పెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్.

  • 16 Dec 2024 02:35 PM (IST)

    విరామం తర్వాత తిరిగి ప్రారంభమైన సభ

    విరామం తర్వాత సభ తిరిగి ప్రారంభమైంది. టూరిజం పాలసీపై స్వల్పకాలిక చర్చ ప్రారంభమైంది. సభలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన చేపట్టింది. ఫ్లకార్డులతో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన చేపట్టారు.

  • 16 Dec 2024 02:15 PM (IST)

    పదేళ్లు భట్టి కూడా బీఏసీలో ఉన్నారు -మంత్రి.శ్రీధర్ బాబు

    బీఏసీ సమావేశం ముగిసింది. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పదేళ్లు బీఆర్ఎస్ ఏం చేసింది? అని ప్రశ్నించారు. బీఏసీ లో అన్ని పార్టీలు అభిప్రాయాలు చెప్తాయన్నారు. తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకుంటారన్నారు. పదేళ్లు భట్టి... కూడా బీఏసీలో ఉన్నారన్నారు. అప్పుడు వాళ్ళు కూడా చాయ్ బిస్కట్ మీటింగ్ పెట్టారా? అని ప్రశ్నించారు. సభ వారికి అనుగుణంగా నడిపించాలి అనుకోవడం సరికాదన్నారు.

  • 16 Dec 2024 02:10 PM (IST)

    ముగిసిన బీఏసీ సమావేశం

    బీఏసీ సమావేశం ముగిసింది. సభ శుక్రవారం వరకు ఉండే అవకాశం.

  • 16 Dec 2024 02:09 PM (IST)

    BAC అంటే బిస్కెట్ అండ్ చాయ్ లాగా చేశారు- హరీష్ రావు

    ప్రతిరోజూ జీరో అవర్ పెట్టాలని అడిగామని మాజీ మంత్రి హరీష్ రావు అన్ఆనరు. టి షర్ట్ లతో ఎందుకు రానియ్యలేదు అని గట్టిగా అడిగామన్నారు. మీ నాయకుడు రాహుల్ గాంధీ టి షర్ట్ లతో వెళ్ళాడు కదా అని గుర్తు చేశామన్నారు. BAC అంటే బిస్కెట్ అండ్ చాయ్ లాగా చేశారని హరీష్ రావు తెలిపారు.

  • 16 Dec 2024 02:09 PM (IST)

    ప్రోటోకాల్ పాటించడం లేదని స్పీకర్ కు చెప్పాము- హరీష్ రావు

    ప్రోటోకాల్ పాటించడం లేదని స్పీకర్ కు చెప్పామని హరీష్ రావు అన్నారు. బీఏసీ పెట్టకుండానే బిల్స్ ఎలా పెడతారు అని అడిగామన్నారు. పెళ్ళిళ్లు ఉన్నాయని సభ పెట్టక పోవడం ఏంటని అడిగామన్నారు. కనీసం 15 రోజులు ఈసారి సబ నడపాలని బీఆర్ఎస్ నుంచి అడిగామన్నారు.

  • 16 Dec 2024 02:07 PM (IST)

    అసెంబ్లీ నాలుగైదు రోజులే నడిపే మూడ్ లో వున్నారు- హరీష్ రావు

    అసెంబ్లీని మేము 15 రోజులు సబ పెట్టాలని అడిగామని చిట్ చాట్ లో హరీష్ రావు అన్నారు. కానీ వాళ్ళు నాలుగైదు రోజులే నడిపే మూడ్ లో ఉన్నారన్నారు. మమ్మల్ని సలహా మాత్రమే ఇవ్వాలని సీఎం అన్నారని తెలిపారు. మీరు కేవలం సలహా మాత్రమే ఇవ్వాలని అంటున్నారన్నారు. ఇదే విషయంపై ఎంఐఎం కూడా వాక్ ఔట్ చేసిందన్నారు.

  • 16 Dec 2024 02:04 PM (IST)

    బీఏసీ నుండి బీఆర్ఎస్, ఎంఐఎం వాకౌట్ ..

    తెలంగాణ అసెంబ్లీ బీఏసీ మీటింగ్ కొనసాగుతుంది. సభ పని దినాలు... అజెండా పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని బీఆర్ఎస్, ఎంఐఎం నిరసన తెలిపింది. ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని బీఏసీ నుండి బీఆర్ఎస్, ఎంఐఎం వాకౌట్ చేసింది గంటన్నరగా కొనసాగుతున్న మీటింగ్.

  • 16 Dec 2024 01:45 PM (IST)

    ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే ఎదురు దాడులు - మధుసూదన చారి

    ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే ఎదురు దాడులు చేస్తున్నారని మండలి ప్రతిపక్ష నేత మధుసూదన చారి అన్నారు. ఓటుకు నోటు కేసులో జైలు పాలయిన ముఖ్యమంత్రి అందరిని జైలుకి పంపాలని అనుకుంటున్నాడని తెలిపారు. ప్రశ్నించే వాళ్ళను జైలుకు పంపుతున్నరు. చట్ట సభల్లో కూడా అలాగే వ్యవహరిస్తున్నారని అన్నారు.

  • 16 Dec 2024 01:43 PM (IST)

    గిరిజన రైతులకు బేడీలపై- మధుసూదన చారి

    గిరిజన రైతులకు బేడీలపై వాయిదా తీర్మానం ఇచ్చాము దాన్ని తిరస్కరించారని మండలి ప్రతిపక్ష నేత మధుసూదన చారి అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందన్నారు. లగచర్ల రైతులకు ప్రభుత్వం ద్రోహం చేసింది, అక్రమ అరెస్టులు చేసిందని తెలిపారు. ప్రభుత్వం సమాధానం చెప్పాలని వాయిదా తీర్మానం ఇస్తే సభను వాయిదా వేశారని తెలిపారు. సభ ఎప్పుడు జరిగిన ఇదే అడుగుతాం, ప్రశ్నిస్తామన్నారు.

  • 16 Dec 2024 01:41 PM (IST)

    లగచర్ల రైతులకు బేడీలా? -బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన

    శాసనమండలి మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన చేపట్టింది. లగచర్ల రైతులకు బేడీలా? అని ప్రశ్నించింది. లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

  • 16 Dec 2024 01:23 PM (IST)

    లాగచర్ల రైతుల అంశంపై చర్చకు అవకాశం ఇవ్వాలి- కేటీఆర్

    లాగచర్ల రైతుల అంశంపై చర్చకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ కు కోరామన్నారు కేటీఆర్ అప్పుల విషయంలో తప్పులు చెబుతున్నారు. ఆర్బీఐ రూ.3 లక్షల 90 వేళా కోట్లు అంటే, ప్రభుత్వమెమో 6 లక్షల 90 వేళా కోట్లు అంటున్నారు. ఇది తప్పు అని, దీనిపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాము. ఇది కూడా సభలో చర్చకు అనుమతి ఇవ్వాలని కోరాము.

  • 16 Dec 2024 01:21 PM (IST)

    స్పీకర్ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాము- కేటీఆర్

    2009-14 వరకు అసెంబ్లీలో తప్పుదోవ పట్టిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. స్పీకర్ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చామన్నారు. మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల మీద జరుగుతున్న పరాజితం అన్నారు. ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులను వేదికలపై కూర్చోబెడుతున్నారు. దీనిపై చర్య తీసుకోవాలని కోరామన్నారు.

  • 16 Dec 2024 01:20 PM (IST)

    మాజీ ఎమ్మెల్యే లకు ప్రవేశం లేదంటున్నారు- కేటీఆర్

    మాజీ ఎమ్మెల్యే లకు ప్రవేశం లేదు అంటున్నారని కేటీఆర్ అన్నారు. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు.. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు మొత్తం ఇక్కడే తిరిగేవారని గుర్తు చేశారు. ప్లే కార్డు లు తేవద్దు అంటున్నారు.. ఫోటోలు తీయొద్దు అంటున్నారని కేటీఆర్ తెలిపారు.

  • 16 Dec 2024 01:18 PM (IST)

    అసెంబ్లీ జరిగే సమయంలో ప్రకటనలు బయట చేయొద్దు- కేటీఆర్

    అసెంబ్లీ లో జరిగే సమయంలో విధాన పరమైన ప్రకటనలు బయట చేయొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కానీ భట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై బయట మాట్లాడారని గుర్తు చేశారు. ఇది ఎంత వరకు సబబు అని స్పీకర్ ను ఆడిగామన్నారు.

  • 16 Dec 2024 01:10 PM (IST)

    ఒక్కొక్కడు పందికొక్కుల్ల పది వేల కోట్లు తిన్నారు- ఎమ్మెల్యే నాయిని

    ఒక్కొక్కడు పందికొక్కుల్ల పది వేల కోట్లు తిన్నారు. అడ్డగోలుగా బలసి కొట్టుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ అన్నారు. గతంలో వీళ్ళు చేసిన అప్పులు ఎంత..? అని ప్రశ్నించారు. ఆర్బీఐ ద్వారా తీసుకున్న అప్పులే చెబుతున్నారు.. ఇతర అప్పులు చెప్పడం లేదన్నారు. బెల్ట్ షాపులు.. లిక్కర్ గురించి కవితను అడిగితే బాగుంటుందన్నారు.

  • 16 Dec 2024 01:08 PM (IST)

    సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు- నాయిని రాజేందర్

    సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ అన్నారు. నిజాలు మాట్లాడితే చనిపోతారు అనే శాపం వాళ్లకు ఉందేమో? అని తెలిపారు. మార్ఫింగ్ చేసిన వీడియోలు టాస్క్ ఫోర్స్ లో దొరికాయి, త్వరలో బయటపెడతామన్నారు. సీనియర్లు ఏదో ఘనకార్యం చేస్తారని అనుకొని వచ్చామన్నారు.

  • 16 Dec 2024 01:07 PM (IST)

    హరీష్ రావు మాటకు సర్పంచ్ లు, ప్రజలు నవ్వుకుంటారు- నాయిని రాజేందర్

    హరీష్ రావు పెండింగ్ బిల్లుల గురించి మాట్లాడితే.. సర్పంచ్ లు, ప్రజలు నవ్వుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ అన్నారు. బీఆర్ఎస్ హాయంలో సర్పంచ్ ల ఆత్మహత్యల తెలియదా? అని ప్రశ్నించారు. మీ పాపాలను మేము సరిదిద్దుతున్నామన్నారు. మా హాయంలో సర్పంచ్ ఎన్నికలే కాలేదన్నారు.

  • 16 Dec 2024 01:04 PM (IST)

    త్వరలోనే క్రెడిట్స్,డిటెన్షన్ పై సమావేశం నిర్వహిస్తాం- మంత్రి దామోదర

    అక్బరుద్దీన్ ప్రశ్నలకు సమాధానంగా త్వరలోనే క్రెడిట్స్,డిటెన్షన్ పై సమావేశం నిర్వహిస్తామన్నారు మంత్రి దామోదర రాజనర్సింహా. మేనేజ్ మెంట్స్ వర్సిటీ వీసీలతో స్పెషల్ మీటింగ్ నిర్వహిస్తామని చెప్పారు.

  • 16 Dec 2024 01:04 PM (IST)

    విద్యార్థులను డీటేయిన్ చేస్తే ఆరేళ్లలో ఇంజనీరింగ్ ఎలా?- అక్బరుద్దీన్

    జేఎన్టీయూ, ఓయూల్లో క్రిడెట్ పాయింట్లలో ఏకరూపత తేవాలన్నారు. డిటేయిన్ అయిన స్టూడెంట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ కు దూరమయ్యారని చెప్పారు. విద్యార్థులను డీటేయిన్ చేస్తే ఆరేళ్లలో ఇంజనీరింగ్ ఎలా పూర్తి చేస్తారని అక్బరుద్దీన్ ప్రశ్నించారు.

  • 16 Dec 2024 01:03 PM (IST)

    జేఎన్టీయూ, ఓయూ వర్సిటీల్లో క్రెడిట్ పాయింట్లలో తేడా ఎందుకు- అక్బరుద్దీన్

    జేఎన్టీయూ, ఓయూ వర్సిటీల్లో క్రెడిట్ పాయింట్లలో తేడా ఎందుకని ప్రశ్నించారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన ఓవైసీ.. అసెంబ్లీలో క్వశ్చన్ అవర సందర్భంగా మాట్లాడిన ఆయన.. రెండు వర్సిటీల్లో సిలబస్ సేమ్ ఉన్నాయన్నారు.

  • 16 Dec 2024 12:51 PM (IST)

    మొత్తం 12 వేల స్కూల్స్ మూత పడే అవకాశం- సబితా ఇంద్రారెడ్డి

    మొత్తం 12 వేల స్కూల్స్ మూత పడే అవకాశం ఉందని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. 10 మంది విద్యార్థులు ఉన్న 4 వేల స్కూల్స్ ను వేరే స్కూల్స్ కి మార్చాలని తెలిపారు. మన ఊరు లో భాగంగా స్కూల్స్ లో కేసీఆర్ బ్రేక్ పాస్ట్ ఏర్పాటు చేశారని తెలిపారు. కానీ ఇప్పుడు ఎందుకు ఏర్పాటు చేయట్లేదన్నారు. గురుకులాలలో పేద ప్రజలు చదువుకుంటున్నారని, వారికి విషఆహారం పెడుతున్నారన్నారు.

  • 16 Dec 2024 12:50 PM (IST)

    ఇప్పటికే 49 మంది విద్యార్థులు చని పోయారు- సబితా ఇంద్రారెడ్డి

    ఐదు లక్షల విద్యాబరోసా ఇస్తా అన్నప్పుడు సంఖ్య పెరగాలి..కానీ ఎందుకు 2 లక్షలు తగ్గిందని తెలిపారు. ఇప్పటికే 49 మంది విద్యార్థులు చని పోయారని అన్నారు.
    ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రభుత్వం పారిపోయిందని తెలిపారు. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వట్లేదు..సర్పంచులకు బిల్లులు ఇవ్వట్లేదన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం వీటిపై సమీక్షించుకోవాలని తెలిపారు.

  • 16 Dec 2024 12:40 PM (IST)

    కాంగ్రెస్ ఎన్నికల ముందు 30 హామీలు ఇచ్చింది- సబితా ఇంద్రారెడ్డి

    కాంగ్రెస్ ఎన్నికల ముందు 30 హామీలు ఇచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. విద్యాశాఖకు సంబంధించి ప్రభుత్వం సమాధానం చెప్పదని అర్ధం అవుతుందన్నారు. 1913 జీరో ఎన్ రోల్ మెంట్ అని చెప్తున్నారని అన్నారు. కేసీఆర్ మన ఊరు మన బడి పేరుతో విద్యా వ్యవస్థలను బలోపేతం చేశారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇచ్చిందన్నారు.

  • 16 Dec 2024 12:25 PM (IST)

    అసెంబ్లీలో లగచర్ల భాదితులు తరుపున పోరాడతాం- జగదీష్ రెడ్డి

    అసెంబ్లీ నడిచినన్ని రోజులు లగచర్ల భాదితులు తరుపున పోరాడడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని జగదీష్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చిన సంగతి లేదన్నారు. లాగచర్ల బాధితులకు అండగా ఉంటామన్నారు.

  • 16 Dec 2024 12:24 PM (IST)

    స్పీకర్ కాంగ్రెస్ పక్షపాతిగా ఉండటం కరెక్ట్ కాదు- జగదీష్ రెడ్డి

    స్పీకర్ కాంగ్రెస్ పక్షపాతిగా ఉండటం కరెక్ట్ కాదని జగదీష్ రెడ్డి అన్నారు. మాదాక వచ్చేసరికి వాయిదా వేయడం కరెక్ట్ కాదన్నారు. లగచర్ల రైతులకు బేడీలు వేస్తూ హాస్పిటల్ కు తీసుకెళ్తున్నారని తెలిపారు. సభలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి అని ప్రయత్నం చేస్తుంటే పారిపోతున్నారన్నారు. స్పీకర్ గా కూర్చున్నపుడు కాంగ్రెస్ తరపు వారని మరచిపోవాలన్నారు.

  • 16 Dec 2024 12:23 PM (IST)

    మేము ప్రజలకు అండగా ఉన్నాం- జగదీష్ రెడ్డి

    ప్రభుత్వం ప్రజలను హింస చేస్తుంది.. మేము ప్రజలకు అండగా ఉన్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ప్రజలకు సంబంధించిన అవకతవకల గురించి చర్చించడమే ఈ సభ యొక్క ఉద్దేశ్యమన్నారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల, అధికారుల నిర్లక్ష్యం వల్ల జరుగుతున్న విషయాలు ప్రజలకు తెలియాలనేది బీఆర్ఎస్ ఉద్దేశ్యం అని తెలిపారు.

  • 16 Dec 2024 12:21 PM (IST)

    శాసన సభలో ఎప్పుడూ కూడా ప్రతిపక్షాలను వ్యతిరేకిస్తున్నారు- జగదీష్ రెడ్డి

    శాసన సభలో ఎప్పుడూ కూడా ప్రతిపక్షాలను వ్యతిరేకిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలను చర్చించడానికి భయమేస్తుందన్నారు.
    ప్రజాస్వామ్యం అంటేనే అందరి మాటలను వినేట్టు ఉండటం అన్నారు.

  • 16 Dec 2024 12:15 PM (IST)

    ప్రశ్నపత్రాల లీక్‌, మాల్‌ ప్రాక్టీస్‌ జరగకుండా పరీక్షలు- మండలిలో భట్టి విక్రమార్క

    ప్రశ్నపత్రాల లీక్‌, మాల్‌ ప్రాక్టీస్‌ జరగకుండా పారదర్శకంగా పరీక్షల నిర్వహణ చేపడుతున్నట్లు శాసన మండలిలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఉద్యోగ ఖాళీలు అంచనా వేసి టీజీపీఎస్సీ (TGPSC) ద్వారా పరీక్షల నిర్వహణ చేపడుతున్నట్లు చెప్పారు. ఉద్యోగాల భర్తీ కోసమే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించామని.. దశలవారీగా భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియామకాలు చేపడతామన్నారు. జాబ్‌ క్యాలెండర్‌ మేరకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని పేర్కొన్నారు.

  • 16 Dec 2024 12:14 PM (IST)

    పులి దాడుల్లో చనిపోతే రూ.10 లక్షల ఆర్థిక సాయం- మంత్రి కొండా సురేఖ

    పులి దాడుల్లో చనిపోతే రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు శాసన మండలిలో మంత్రి కొండా సురేఖ తెలిపారు. అమ్రాబాద్‌ మాదిరిగా కవ్వాల్‌లోనూ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. శాసనమండలిలో సభ్యుల ప్రశ్నలకు కొండా సురేఖ సమాధానమిచ్చారు. ఆ ప్రాంతంలో విద్య, ఉపాధి దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు.

  • 16 Dec 2024 12:11 PM (IST)

    తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ లేదు -మండలిలో ఎమ్మెల్సీ ఎల్ రమణ

    తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ లేదని మండలిలో ఎమ్మెల్సీ ఎల్ రమణ అన్నారు. బతుకమ్మ చీరల పని ఆగడంతో చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. కేసీఆర్ పెట్టిన పథకాలు నిలిచిపోయాయి మళ్ళీ వాటిని ప్రారంభించాలన్నారు. ఎన్నికల హామీల్లో బాగంగా చేనేత కార్మికులకు ఉపాధిని పెంచుతామని చెప్పారని తెలిపారు. నెల నెలకు ఫించన్ ఇవ్వాలి, చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేయాలన్నారు. రాహుల్ గాంధీ చేనేత కార్మికులకు సీఎస్టీ ఎత్తివేస్తామని చెప్పారు.. అది ఇంకా అమలు చేయడం లేదన్నారు.

  • 16 Dec 2024 12:10 PM (IST)

    గత ప్రభుత్వంలో నేతన్న భీమా తెచ్చినం- మండలిలో ఎమ్మెల్సీ ఎల్ రమణ

    గత ప్రభుత్వంలో నేతన్న భీమా తెచ్చినామని శాసన మండలిలో ఎమ్మెల్సీ ఎల్ రమణ అన్నారు. వ్యవసాయం తర్వాత అత్యంత ప్రధాన్యమైంది చేనేతవృత్తి అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 28 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఇప్పటివరకు 28 మందికి న్యాయం జరగలేదు వారికి ప్రభుత్వం సాయం అందించాలన్నారు. దఉపాధి అవకాశాలు లేక ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు.

  • 16 Dec 2024 12:08 PM (IST)

    ఉర్దూ మీడియం పోస్టులు డీఎస్సిలో అభ్యర్థులు ఉండటం లేదు- ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

    ఉర్దూ మీడియం పోస్టులు డీఎస్సిలో అభ్యర్థులు ఉండటం లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఎస్సి, ఎస్టీ, మైనార్టీ కేటగిరీలోని కొన్ని పోస్టులు డీఎస్సి వంటి ఉద్యోగాల్లో భర్తీ కావడం లేదని తెలిపారు. ఆ ఉద్యోగాల రిజర్వేషన్లు డీ రిజర్వ్ చేసి ఆ ఖాళీలను ఓపెన్ కేటగిరిలో చూపెట్టాలన్నారు.

  • 16 Dec 2024 12:04 PM (IST)

    దశల వారీగా ఉద్యోగ నియామక ప్రక్రియ చేపడుతున్నాం- భట్టి విక్రమార్క

    గత ప్రభుత్వంలో కొన్ని, మా ప్రభుత్వంలో కొన్ని రిక్రూట్ మెంట్ చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి వదిలేసింది.. రిక్రూట్ మెంట్ చేయలేదన్నారు. మేం ఇచ్చిన డేట్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. దశల వారీగా ఉద్యోగ నియామక ప్రక్రియ చేపడుతున్నామని తెలిపారు. ఉర్దూ విభాగానికి సంభందించి కొన్ని పోస్టులను డీ రిజర్వ్ చేసి ఓపెన్ కేటగిరిలో పెడితే బాగుటుందని సభ్యులు అంటున్నారు. అలాంటి అవకాశం లేదన్నారు.

  • 16 Dec 2024 12:03 PM (IST)

    రాష్ట్రం తెచ్చుకుంది ఉద్యోగాల కోసం- మండలిలో భట్టి విక్రమార్క

    రాష్ట్రం తెచ్చుకుంది ఉద్యోగాల కోసమని శాసన మండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 10 సంవత్సరాల్లో ఉద్యోగాల రిక్రూట్మెంట్ జరగలేదని తెలిపారు.
    55 వేల నుంచి 56వేల మధ్యలో రిక్రూట్ మెంట్ చేశామన్నారు.

  • 16 Dec 2024 11:41 AM (IST)

    జగిత్యాలలో సిల్క్ వార్మ్ పరిశోధన కేంద్రం- ఎమ్మెల్సీ కవిత

    జగిత్యాల కేంద్రంగా సిల్క్ వార్మ్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మల్సీ కవిత అన్నారు. రైతులను మల్బరీ సాగు వైపు ప్రోత్సహించాలన్నారు. సెరికల్చర్ విభాగంలో దాదాపు 650 ఉద్యోగాలు ఉంటే... దాదాపు 400 మంది ఇటీవల రిటైర్ అయ్యారు.. వాటిని వెంటనే భర్తీ చేయాలని కవిత తెలిపారు.

  • 16 Dec 2024 11:40 AM (IST)

    రాష్ట్రంలో పట్టుపరిశ్రమను ప్రోత్సహించాలి -శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత

    రాష్ట్రంలో పట్టుపరిశ్రమను ప్రోత్సహించాలని శాసనమండలిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. చేనేత కార్మికులకు బెంగళూరు నుంచి పట్టును దిగుమతి చేసుకోవడం వల్ల అదనపు భారం పడుతుందన్నారు. పట్టుగూళ్ల విషయంలో చేనేత కార్మికులకు బాకీ ఉన్న 8 కోట్లను వెంటనే విడుదల చేయాలన్నారు. చేనేత పై కేంద్రం విధించే జిఎస్టిని రీయింబర్స్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని తెలిపారు. ఆ హామీ అమలు ఎంతవరకు వచ్చిందో ప్రభుత్వం చెప్పాలన్నారు.

  • 16 Dec 2024 11:24 AM (IST)

    రేషన్ బియ్యం వినియోగంలో విప్లవాత్మకమైన మార్పులు- ఉత్తమ్ కుమార్

    రాబోయే రోజుల్లో రేషన్ బియ్యం పంపిణీ, వినియోగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వస్తామని మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పెద్ద ఎత్తున పీడీఎస్ రైస్ అక్రమ రవాణా జరుగుతున్నది వాస్తవం అన్నారు. దొడ్డు బియ్యాన్ని ప్రజలు తినడంలేదు. అందుకే సన్నబియ్యం అందజేయాలని చూస్తున్నామన్నారు.

  • 16 Dec 2024 11:22 AM (IST)

    రేషన్ బియ్యం కాకినాడ పోర్ట్ కు పోతున్నాయి- గుత్తా సుఖేందర్ రెడ్డి

    రేషన్ బియ్యం కాకినాడ పోర్ట్ కు పోతున్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సివిల్ సప్లై అధికారులు సమగ్ర విచారణ జరిపి అవసరం లేని వారికి కార్డులను తొలగించి, అవసరం ఉన్న వారికి మాత్రమే రేషన్ కార్డులను పంపిణీ చేయాలన్నారు.

  • 16 Dec 2024 11:21 AM (IST)

    రేషన్ కార్డుల లెక్కలు పొంతన లేకుండా పోతున్నాయి- మండలి చైర్మన్

    రేషన్ కార్డుల లెక్కలు పొంతన లేకుండా పోతున్నాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. అసలైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. పేదరికం అనుభవిస్తున్న వారికి మాత్రమే ప్రభుత్వం సరుకులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అనర్హులు కూడా రేషన్ కార్డ్ పొంది, ప్రభుత్వం ఆదాయానికి గండి పెడుతున్నారన్నారు.

  • 16 Dec 2024 11:19 AM (IST)

    నేను అడిగిన ప్రశ్న వేరు.. చెప్పింది వేరు- అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణ

    ప్రభుత్వానికి అనుకూలమైన ప్రశ్నలు మాత్రమే పొందు పరిచారని అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మండిపడ్డారు. నేను అడిగిన ప్రశ్న వేరు చెప్పింది వేరన్నారు. గత ప్రభుత్వంలో పరిశ్రమల కోసం ఎంత భూమి ఇచ్చారు .. ఎన్ని పరిశ్రమలు ప్రారంభం అయ్యాయని ప్రశ్నించారు. ఎన్ని ప్రారంభం కాలేదు.. ఆ భూమి నీ తిరిగి స్వాధీనం చేసుకున్నారు అన్నారు. పేదల దగ్గర భూములు తీసుకొని పారిశ్రామిక వేత్తలకు ఇస్తే ఆ భూముల మీద లోన్ లు తీసుకుంటున్నారు... ఇండస్ట్రీ లను ప్రారంభించడం లేదు... ప్రారంభించిన సిక్ అయినట్టు చూపిస్తున్నారని తెలిపారు.

  • 16 Dec 2024 11:17 AM (IST)

    కొత్తగా 36 లక్షల మందికి కార్డులు ఇవ్వాలనే ఆలోచన- ఉత్తమ్ కుమార్

    కొత్తగా 36 లక్షల మందికి కార్డులు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీలో ఎంపీ, ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల సూచనలు ఈరోజు జరిగే కేబినెట్ భేటీలో చర్చిస్తామన్నారు. రేషన్ కార్డుల జారీలో పాత పద్ధతి కొనసాగుతూనే..కొత్త సాంకేతికతను అందిపుచ్చుకునేలా కార్డుల్లో ఎలక్ట్రానిక్ చిప్ లను ఏర్పాటు చేస్తామన్నారు.

  • 16 Dec 2024 11:17 AM (IST)

    సంక్రాంతి తర్వాత కొత్త కార్డులు- శాసన మండలిలో ఉత్తమ్ కుమార్

    కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు కేబినెట్ సబ్ కమిటీ వేశామని శాసన మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. సంక్రాంతి తర్వాత కొత్త కార్డులను అందజేస్తామన్నారు. లబ్ధిదారులకు ఆరు కిలోల సన్నబియ్యం కూడా అందజేస్తామన్నారు. కొత్త కార్డులకు 956ల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామన్నారు.

  • 16 Dec 2024 10:59 AM (IST)

    వాక్ ఔట్ తర్వాత సభ లోపలకి బీఆర్ఎస్ సభ్యులు

    వాక్ ఔట్ తర్వాత సభ లోపలకి బీఆర్ఎస్ సభ్యులు వచ్చారు. సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లకు 9 నెలలు అయినా జీతాలు పెండింగ్ లో ఉన్నాయన్నారు.
    చేసిన పనులకు బిల్లులు ఇవ్వరు, జీతాలు ఇవ్వరని తెలిపారు. అప్పులు కట్టలేక వారు చాలా బాధల్లో ఉన్నారన్నారు. ఇప్పటికైనా బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టమైన తేదీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

  • 16 Dec 2024 10:56 AM (IST)

    అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్

    సర్పంచ్ ల పెండింగ్ బిల్లులపై మంత్రి సరైన సమాధానం ఇవ్వలేదని బీఆర్ఎస్ వాక్ ఔట్ చేసింది.

  • 16 Dec 2024 10:55 AM (IST)

    హరీష్ హయంలో సర్పంచి...ఉప సర్పంచ్ లు ఆత్మహత్య- మంత్రి శ్రీధర్ బాబు

    హరీష్ హయంలో సర్పంచి...ఉప సర్పంచ్ లు ఆత్మహత్య చేసుకున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రతి నెల డబ్బులు విడుదల చేస్తే.. పెండింగ్ బిల్లులు ఉంటాయా? అని మంత్రి ప్రశ్నించారు.

  • 16 Dec 2024 10:54 AM (IST)

    పల్లె ప్రగతికి 3300 కోట్లు ఇచ్చాం- హరీష్ రావు

    పల్లె ప్రగతికి 3300 కోట్లు ఇచ్చామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నేను డబ్బులు పల్లె ప్రగతికి 3300 కోట్లు ఇచ్చామన్నారు. మీరు ఇచ్చి ఉంటే బకాయిలు ఉండేవి కావన్నారు. సర్పంచులు ఉసూరు పోసుకుంటుందన్నారు. కాంగ్రెస్ హస్తం గుర్తు భస్మాసుర హస్తం అయ్యిందన్నారు. మంత్రి బాధ్యత రహిత సమాధానం చెబుతున్నారు. మేము సభ నిండు వకౌట్ చేస్తున్నామన్నారు.

  • 16 Dec 2024 10:52 AM (IST)

    సర్పంచులు ఆత్మహత్య బీఆర్ఎస్ హయంలో- మంత్రి సీతక్క

    సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళ హయంలోనే అని మంత్రి సీతక్క అన్నారు. పెండింగ్ బిల్లులు... మీరు మాకు ఇచ్చిన వారసత్వమని తెలిపారు. ఆర్థిక మంత్రిగా హరీష్ రావు ఒక్క సంతకం పెడితే 600 కోట్లు బిల్లులు ఐపోయేవీ అని తెలిపారు. బీఆర్ఎస్ అంటే..బకాయిల రాష్ట్ర సమితి అన్నారు. అందుకే బిల్లులు సంతకం పెట్టలేదన్నారు.

  • 16 Dec 2024 10:51 AM (IST)

    పెండింగ్ బిల్లులు... మీరు మాకు ఇచ్చిన వారసత్వం - మంత్రి సీతక్క

    పెండింగ్ బిల్లులు... మీరు మాకు ఇచ్చిన వారసత్వమని మంత్రి సీతక్క అన్నారు. పెండింగ్ బిల్లులు..మా హయంలో కాదన్నారు. 2014 నుండి పెండింగ్ బిల్లులు ఉన్నాయన్నారు. హరీష్ రావు ..ఆర్థిక శాఖ మంత్రి గా పని చేశారని తెలిపారు. మీ చేతులతో... సంతకం పెట్టిస్తే.. బిల్లులు ఐపోయేవని మంత్రి అన్నారు. ఉపాధి హామీ పనులు బిల్లులు క్లియర్ చేశామన్నారు. కేంద్రం నుండి నిధులు రాక ఇబ్బంది అయ్యిందన్నారు.

Show comments