Site icon NTV Telugu

BC Reservations: నేడు సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ.. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ!

Sc

Sc

BC Reservations: తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును తీసుకొచ్చింది. ఇక, దీనిపై హైకోర్టు స్థానిక ఎన్నికలపై ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వంగ గోపాల్‌ రెడ్డి సెప్టెంబరు 29వ తేదీన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారంటూ పేర్కొన్నారు. దీంతో ఈరోజు ( అక్టోబర్ 6న) బీసీ రిజర్వేషన్లపై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేయనుంది.

Read Also: Sreeleela : సౌత్ క్యూటీకి బాలీవుడ్ బంపర్ ఆఫర్.. కరణ్ జోహార్ ప్రాజెక్ట్‌లో శ్రీలీల

అయితే, సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల పిటిషన్‌పై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో ప్రభుత్వ వాదనలను గట్టిగా వినిపించాలని నిర్ణయం తీసుకుంది. గత రాత్రి బీసీ మంత్రులతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ప్రభుత్వం, పార్టీ పరంగా తీసుకోవాల్సిన అంశాలపై భట్టి విక్రమార్కతో సీఎం రేవంత్‌ రెడ్డి చర్చించారు. సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింగ్వి.. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో వాదించనున్నారు.

Read Also: Krithi Shetty: బాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకోబోతున్న కృతి శెట్టి

ఇక, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై తీవ్ర వివాదం కొనసాగుతుంది. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇంతకుముందు న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతం మించకూడదని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, దాన్ని ఉల్లంఘించిన తెలంగాణ ప్రభుత్వం, బీసీలకు ఏకంగా 42 శాతం రిజర్వేషన్ల ఇవ్వడంతో, వారికి 50 శాతం మించిపోతుంది. కాబట్టి, ఇప్పుడు కోర్టు తీర్పు ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ మార్పులు జరిగే అవకాశం ఉందనే విషయం క్లియర్ గా తెలుస్తుంది.

Exit mobile version