Site icon NTV Telugu

Sujana Chowdary: సుజనా చౌదరికి తీవ్ర గాయం.. లండన్‌ నుంచి హైదరాబాద్‌కు తరలింపు

Sujana Chowdary

Sujana Chowdary

Sujana Chowdary: ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్‌ నేత, విజయవాడ వెస్ట్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరికి తీవ్ర గాయం అయ్యింది.. లండన్ పర్యటనలో ఉన్న ఆయన బాత్రూమ్‌లో జారిపడటంతో కూడి చేయి విరిగినట్టుగా తెలుస్తోంది.. దీంతో.. లండన్‌లో ప్రాథమిక వైద్యం తీసుకున్న ఆయన్ను మెరుగైన వైద్య సేవల కోసం వెంటనే హైదరాబాద్‌కు తరలించారు.. సర్జరీ కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు సుజనా చౌదరి..

Read Also: Mega 157 : అనిల్ రావిపూడి సినిమాలో ఇద్దరు భామలతో ‘చిరు’

లండన్‌ నుంచి తెల్లవారుజామున 3 గంటల సమయంలో శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సుజనా చౌదరిని.. బేగంపేట్‌లోని కిమ్స్‌ ఆస్పత్రికి తరలించినట్టుగా చెబుతున్నారు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి పరిస్థితి నిలకడగా ఉన్నట్టుగా తెలుస్తోంది.. మరోవైపు, లండన్‌ పర్యటనలో ఉన్న సుజనా చౌదరి ఒక సూపర్ మార్కెట్‌లో ప్రమాదవశాత్తూ కిందపడిపోయారని.. ఘటనలో ఆయన కుడి భుజానికి బలమైన గాయం అయ్యింది.. ఎముక విరిగినట్లు సమాచారం. దీనిపై బీజేపీ శ్రేణులు, సుజనా చౌదరి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. సుజనా చౌదరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టుగా తెలుస్తోంది.. అయితే, సంబంధిత ఆస్పత్రి సుజనా చౌదరి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేస్తే.. అసలు సుజనా చౌదరికి ఏం జరిగింది? అనేదానిపై క్లారిటీ రానుంది..

Exit mobile version