Atrocious: మొన్న షాద్‌నగర్‌.. నేడు మైలార్ దేవపల్లి.. తండ్రులపై కొడుకుల అఘాయిత్యాలు..

  • హైదరాబాద్ లోని మైలార్దేవపల్లీ లో దారుణం..
  • 4 లక్షల రూపాయల కోసం తండ్రిని చంపిన కసాయి కొడుకు..
Murder

Murder

Atrocious: కుటుంబాలపై ప్రేమ తగ్గుతుంది. ఇప్పుడు అందరికి కావాల్సింది మణి. డబ్బు వుంటేనే ఏదైనా. బతకడానికి కష్టపడ కుండా చేతిలో మణి వుంటే దునియాన్నే ఏలేయొచ్చనే ఆశ. చేతిలో పైసా ఉంటే జీవితాన్ని ఆనందంగా గడిపేయొచ్చు. ఇది అందరిలో ఉండే ఆలోచన. అంతేకాదు.. ఈ డబ్బు కోసం ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడటం లేదు. దీనికి ఉదాహరణ మొన్న షాద్ నగర్ లో జరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కమ్మరి కృష్ణకు ఆస్తికోసం కన్న కొడుకులే కిరాతకంగా హత్య చేయగా నేడు మైలార్ దేవపల్లిలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. రూ.4 లక్షల కోసం కన్న తండ్రిని దారుణంగా హత్య చేసిన ఘటన నగరంలో సంచలనంగా మారింది.

Read also: Crime News: దారుణం.. 19 ఏళ్ల యువతిని కిడ్నాప్‌ చేసి యువకుడు అత్యాచారం

మైలార్ దేవపల్లిలోని ప్రగతి కాలనీలో కిష్టప్ప అనే వ్యక్తి కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. అతనికి మహేందర్ అనే కొడుకు వున్నాడు. వీరి కుటుంబంలో డబ్బు చిచ్చుపెట్టింది. తండ్రిని కొడుకు డబ్బులు అడగటంతో తండ్రి నిరాకరించాడో ఏమో తెలియదు కానీ.. తండ్రిని అతికిరాతకంగా హత్య చేశాడు కొడుకు. తండ్రి నిద్రిస్తుండగా గదిలోకి వెళ్లిన కొడుకు తండ్రి కిష్టప్పను కొడుకు మహేందర్ పక్కనే వున్న దిండును తీసుకుని తండ్రి మొఖంపై పెట్టి ఊపిరి ఆడకుండా చేశాడు. దీంతో కిష్టప్ప ఊపిరి ఆడక నరకయాతన అనుభవించాడు. చివరకు ప్రాణాలు విడిపెట్టాడు. తండ్రి చనిపోవడంతో బీరువాలో వున్న రూ. 4 లక్షలను తీసుకుని ఏమీ తెలియనట్లు తండ్రి చనిపోయాడని ముసలి కన్నీరు కార్చాడు. అయితే అక్కడే వున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటా హుటిన ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. కొడుకుపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి కిష్టప్ప గదిలో వున్నప్పుడు భార్య ఏం చేస్తుంది? అసలు డబ్బులు గురించి తండ్రి కొడుకుల మద్య ఎందుకు గొడవ మొదలైంది అనేది ఇంకా తెలియరాలేదు. రూ. 4 లక్షల కోసం తండ్రిని కొడుకు ఎందుకు హత్య చేశాడు. రూ. 4 లక్షలు కిష్టప్ప దగ్గర ఎలా వచ్చాయి అనే దానిపై ఆరా తీస్తున్నారు.
Hyderabad Crime: ఎస్ ఆర్ నగర్ లో దారుణం.. హాస్టల్ లో యువకుడి హత్య..