NTV Telugu Site icon

Kuna Venkatesh Goud: టీడీపీ సీనియర్ నేత కూన వెంకటేష్ గౌడ్ కన్నుమూత..

Kuna Venkatesh

Kuna Venkatesh

Kuna Venkatesh Goud: తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు కూన వెంకటేష్‌ గౌడ్‌ నిన్న (శుక్రవారం) రాత్రి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు. గతంలో కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా.. అలాగే, సికింద్రాబాద్, సనత్‌నగర్‌ నియోజకవర్గాల నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడిగా పని చేశారు. ఆ తరువాత ఆయన బీఆర్ఎస్ లో చేరారు. ఇటీవల తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. అయితే, కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఇంటి దగ్గరే ఉంటున్నారు. వెంకటేష్ గౌడ్ కు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కాగా, ప్రస్తుతం బేగంపేటలోని బ్రాహ్మణవాడిలో తన నివాసం దగ్గర ఆయన భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులు ఉంచారు. కూన వెంకటేష్‌ గౌడ్‌ అంత్యక్రియలు ఆయన స్వస్థలం గాజులరామారంలో ఇవాళ (శనివారం) నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Show comments