Robbers Attacked: పెద్ద అంబర్‌ పేటలో పోలీసులపై దాడికి తెగబడ్డ దోపిడి దొంగలు..

  • పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పోలీసుల కాల్పులు ..
  • పోలీసులపై కత్తులతో దాడికి దిగిన పార్థ గ్యాంగ్ ..
  • దొంగలను పట్టుకునేందుకు రెండు రౌండ్లు కాల్పులు జరిపిన నల్గొండ పోలీసులు..
Fair

Fair

Robbers attacked: పెద్ద అంబర్‌ పేటలో పోలీసులపై దొంగల కాల్పులు కలకలం రేపాయి. పోలీసులపై కత్తులతో దాడి చేసి పారిపోతున్న దొంగలపై పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పోలీసుల కాల్పులు జరిపారు. పోలీసులపై దాడికి తెగబడ్డ దోపిడి దొంగలు పార్థ గ్యాంగ్ గా గుర్తించారు. కాల్పులు జరుపుతున్న సమయాంలో పార్థ గ్యాంగ్ పోలీసులపై కత్తులతో దాడికి దిగింది. దీంతో ఇటు దొంగలు, అటు పోలీసుల మధ్య పెద్ద వార్ చోటచేసుకుంది. పోలీసుల నుంచి దోపిడీ దొంగలు తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. పార్థ గ్యాంగ్ ని పట్టుకునేందుకు నల్గొండ పోలీసులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. దోపిడీ దొంగలపై కాల్పులు జరిపి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దోపిడీలు దొంగతనాలు హత్యలు చేయడంలో ఆరితేరిన పార్థ గ్యాంగ్ గా తెలిపారు.

Read also: Golconda Bonalu: బోనాలకు ముస్తాబైన గోల్కొండ.. అందుబాటులో ప్రత్యేక బస్సులు..

అయితే.. దోపిడి దొంగలు వస్తున్నారని సమాచారంతో నల్గొండ పోలీసులు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద మాట వేశారు. వ్యాన్ లో వస్తున్న దోపిడీ దొంగలను అడ్డగించేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. పోలీసులను గమనించిన దొంగలు వ్యాన్ ను అపకుండా స్పీడ్ తో అక్కడి నుంచి పరార్ అయ్యేందుకు ప్రయత్నించారు. అయినా దొంగలు వున్న వ్యాన్ ను ఆపేందుకు పోలీసులు ప్రయత్నించడంతో పోలీసులపై పార్థ గ్యాంగ్ కత్తులతో దాడికి తెగబడింది. దోపిడీ దొంగలపై కాల్పులు జరిపి నలుగురిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరిద్ద మధ్య జరిగిన వార్ అచ్చం సినిమా సీన్ ను తలపించింది. ఈ దాడిని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
Weather Report: తెలుగు రాష్ట్రాలకు నేడు వర్షాలు తక్కువే.. ఐఎండీ వెల్లడి..