CM Revanth Reddy UK, USA Tour: సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. కీలక భేటీలు.. ఆగస్టు 20 నుంచి 30 వరకు పూర్తి షెడ్యూల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy UK, USA Tour: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఆగస్టు 20 నుంచి 30వ తేదీ వరకు యూకే, అమెరికాలో సీఎం పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు ప్రముఖ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలను సందర్శించడంతో పాటు వివిధ సమావేశాల్లో పాల్గొననున్నారు.
ఆగస్టు 20న లండన్‌కు ప్రయాణం
ఆగస్టు 20వ తేదీ అర్ధరాత్రి 12:30 గంటలకు న్యూఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో సీఎం రేవంత్ రెడ్డి లండన్‌కు బయలుదేరనున్నారు. ఆగస్టు 20 ఉదయం 7 గంటలకు యూకే స్థానిక కాలమానం ప్రకారం లండన్ చేరుకోనున్నారు.
Also Read
- Bhatti Vikramarka: పెట్టుబడిదారులకు స్వర్గధామం తెలంగాణ.. క్లీన్ ఎనర్జీ మ్యానుఫాక్చరింగ్ హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం.!
- Mu*rder: బాలాపూర్‌లో దారుణం.. ప్రియురాలిని హత్య చేసి గోనె సంచిలో పెట్టిన ప్రియుడు
- Medico Suicide: ఉప్పల్‌లో విషాదం.. మెడికో బలవన్మరణం.!
- Fake Idols : నకిలీ విగ్రహాలతో మాయాజాలం.. ఆరుగురు ముఠా అరెస్ట్.!
ఆగస్టు 21న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సందర్శన
ఆగస్టు 21న ఉదయం 10:30 గంటలకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని బ్లావాట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌ను సీఎం సందర్శించనున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు EPL ఫుట్‌బాల్ ప్రెజెంటేషన్ కార్యక్రమం కోసం ఎమిరేట్స్ స్టేడియాన్ని సందర్శించనున్నారు.
ఆగస్టు 22న పలు కీలక సమావేశాలు
ఆగస్టు 22న ఉదయం 10:30 గంటలకు కేంబ్రిడ్జ్ బృందంతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఉదయం 11:30 గంటలకు లండన్ యూనివర్సిటీ క్యాంపస్‌లోని సెనేట్ హౌస్‌ను సందర్శించనున్నారు. సాయంత్రం 4 గంటలకు లండన్ బిజినెస్ స్కూల్‌ను సందర్శించనున్నారు.
ఆగస్టు 23న అమెరికాకు పయనం
యూకే పర్యటన అనంతరం ఆగస్టు 23న సీఎం రేవంత్ రెడ్డి లండన్ నుంచి అమెరికాలోని బాస్టన్‌కు విమానంలో ప్రయాణించనున్నారు. అక్కడ కూడా పలు ప్రముఖ విద్యా సంస్థలను సందర్శించి సమావేశాల్లో పాల్గొననున్నారు.
ఆగస్టు 24న హార్వర్డ్, MIT సందర్శన
ఆగస్టు 24న ఉదయం 10:30 గంటలకు హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్‌ను సీఎం సందర్శించనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు MIT క్యాంపస్‌ను సందర్శిస్తారు. అదే రోజు రాత్రి 7 గంటలకు బాస్టన్ నుంచి న్యూయార్క్‌కు బయలుదేరనున్నారు.
ఆగస్టు 25న మరో రెండు కీలక కార్యక్రమాలు
ఆగస్టు 25న ఉదయం 10:30 గంటలకు నోర్త్-ఈస్టర్న్ యూనివర్సిటీ క్యాంపస్‌ను సీఎం సందర్శించనున్నారు. సాయంత్రం 4 గంటలకు వర్జీనియా టెక్ యూనివర్సిటీ ప్రతినిధుల బృందంతో సమావేశం కానున్నారు.
ఆగస్టు 26న మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
ఆగస్టు 26న న్యూయార్క్‌లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (USA) ఆధ్వర్యంలో నిర్వహించే ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు, వివిధ వర్గాల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది.
ఆగస్టు 29న హైదరాబాద్‌కు తిరుగు
అమెరికా పర్యటన ముగించుకుని ఆగస్టు 29న న్యూయార్క్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు. ఆగస్టు 30న హైదరాబాద్ చేరుకోనున్నారు.
మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో యూకే, అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, బిజినెస్ స్కూళ్లను సందర్శించడంతో పాటు పలు ప్రతినిధి బృందాలతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ పర్యటన ద్వారా విద్య, పరిశ్రమలు, పెట్టుబడులు, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు సంబంధించిన అంశాలపై చర్చలకు అవకాశం ఉండనుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy UK, USA Tour: సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. కీలక భేటీలు.. ఆగస్టు 20 నుంచి 30 వరకు పూర్తి షెడ్యూల్
-
Strait of Hormuz: అమెరికా మ్యాప్‌లో ‘‘హార్ముజ్ జలసంధి’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
-
Jr NTR: ‘NTRTAIN’తో కొత్త ఇన్నింగ్స్.. సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన జూనియర్ ఎన్టీఆర్?
-
Jharkhand: ‘భార్యతో చెప్పా.. కావాలంటే విడాకులు తీసుకో’.. జార్ఖండ్‌లో సెలెక్టెడ్ అభ్యర్థి ఆక్రందన
-
Party Movie: అస్తిత్వాల అంతర్మథనం “పార్టీ”
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!