CM Revanth Reddy: దేశ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది..
- ఈ దేశ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది..
- భక్తి శ్రద్ధలతో ఈ దేశాన్ని పాలించిన చరిత్ర మనది..
- తెలంగాణ ఆకాంక్షల విషయంలో సైతం ఆ విషయం సమకాలీన సాక్ష్యంగా ఉంది..
- 2004 లో కరీంనగర్ వేదికగా తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ మాట ఇచ్చారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: ఈ దేశ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలది. భక్తి శ్రద్ధలతో ఈ దేశాన్ని పాలించిన చరిత్ర మనది. తెలంగాణ ఆకాంక్షల విషయంలో సైతం ఆ విషయం సమకాలీన సాక్ష్యంగా ఉంది. 2004 లో కరీంనగర్ వేదికగా తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ మాట ఇచ్చారు. తెలంగాణ ప్రజల మనసు నాకు తెలుసు. వారి ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. జూన్ 2, 2014 న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో… ఆమె మాట ఇస్తే అది శిలాశాసనం అన్న విషయం మరోసారి రుజువైంది. మా సిద్ధాంతం గాంధీ సిద్ధాంతం. మా వాదం గాంధేయవాదం. మహాత్ముడి దృష్టిలో స్వాతంత్ర్యం అంటే కేవలం రాజకీయ విమోచనం మాత్రమే కాదు. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పునరుజ్జీవనం. సమాజంలో అట్టడుగున ఉన్న అణగారిన వర్గాలకు స్వాతంత్య్ర ఫలాలు అందినప్పుడే మనం సాధించిన స్వాతంత్ర్యానికి, మహనీయుల త్యాగాలకి అర్థం ఉందన్నారు.
Read also: CM Revanth Reddy: గోల్కొండ కోటపై రెప రెప లాడిన జాతీయ జెండా.. జాతిని ఉద్దేశించి సీఎం ప్రసంగం..
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
- Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
అన్ని వర్గాల సర్వతోముఖాభివృద్ధి జరిగినప్పుడే ఈ దేశ ప్రజాస్వామ్యానికి విలువ, గౌరవం పెరుగుతుంది. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష, యువత బలిదానాలు, విద్యార్థుల పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద కాలం తర్వాత నిజమైన ప్రజా పాలన మొదలైంది. నాటి బ్రిటీషు దాస్య శృంఖలాల నుండి దేశం ఏ విధంగా ఐతే విముక్తి చెందిందో… అదే స్ఫూర్తితో, అదే పోరాట పటిమతో అంతిమ పోరాటం చేసి డిసెంబర్ 3, 2023న స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని పొందాం. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం కొలువై ఉంది. తొలి సారి రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధ పాలన జరుగుతోంది. గడచిన పదేళ్లుగా తెలంగాణ కోల్పోయిన స్వేచ్ఛను పునరుద్ధరించడమే మా ప్రభుత్వ తొలి ప్రాధాన్యతగా భావించాం. భౌతికంగా కంచెలు తొలగించడమే కాదు… మానసిక బానిసత్వ సంకెళ్లు తెంచేశాం. పాలకులు తప్పు చేస్తే నిలదీసే స్వేచ్ఛ ఈ రోజు తెలంగాణలో ఉంది. పరిపాలనలో లోటుపాట్లు ఉంటే సూచనలు, సలహాలు స్వీకరించే సౌలభ్యం కల్పించాం. ప్రతి నిర్ణయంలో ప్రజాహితాన్ని చూస్తున్నాం. లోతైన సమీక్షలతో మంచి చెడులను విశ్లేషించి… మెజారిటీ వర్గాల ప్రయోజనాలే ప్రామాణికంగా పాలన చేస్తున్నాం. ఇంతటి వ్యవస్థలో లోటు పాట్లు ఉండొచ్చని తెలిపారు.
Read also: Medical Services: నిలిచిన వైద్యసేవలు.. అత్యవసర పరీక్షలు సైతం అందక గర్భిణీల అవస్థలు
మా నిర్ణయాలలో తప్పు జరిగితే సరిదిద్దుకుంటున్నాం. ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేసినప్పటికీ సంయమనం పాటిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యం అన్న స్పృహ, స్ఫూర్తితో పాలన చేస్తున్నాం. ఎన్నికల సందర్భంలోనే చెప్పాం. మేం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామన్నాం. ఈ రోజు అక్షరాలా అది చేసి చూపిస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం ప్రజా పాలన సాగిస్తున్నాం. ప్రజలందరికీ సామాజిక న్యాయం, సమానావకాశాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర ఆవిర్భావానికి దశాబ్ద కాలం పూర్తయిన సందర్భంగా ఇటీవలే దశాబ్ది వేడుకలను ఘనంగా జరుపుకున్నాం. ఈ ఉత్సవాల సందర్భంగా అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆర్థిక పునరుజ్జీవనానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ సాధించుకొని దశాబ్ద కాలమైనా రాష్ట్ర గీతం లేని పరిస్థితి మొన్నటి వరకు ఉన్నది. ప్రముఖ ప్రజాకవి అందెశ్రీ రాసిన “జయ జయహే తెలంగాణ…” గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించి ఆ లోటును భర్తీ చేశాం. తద్వారా సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికాం.
Read also: Sitarama Project: దశాబ్దాల సాగు నీటి కల సాకారం.. సీతారామ ప్రాజెక్ట్ కు సీఎం రేవంత్ ప్రారంభోత్సవం..
తెలంగాణ రాష్ట్ర పేరును సూచించే సంక్షిప్త అక్షరాల విషయంలో TS స్థానంలో TGని ప్రభుత్వం పునరుద్ధరించింది. ఇది ప్రజల ఆకాంక్ష. మా ప్రభుత్వం అధికారం చేపట్టేనాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విధ్వంసమై ఉంది. గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు 10 రెట్లు పెరిగింది. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో 75,577 కోట్ల రూపాయలుగా ఉన్న అప్పు, గత ఏడాది డిసెంబరు నాటికి దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. దీనిపై శ్వేతపత్రం కూడా విడుదల చేశాం. దయనీయ స్థితిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు స్వస్థత చేకూర్చడం కోసం ఆర్థిక పునరుజ్జీవనం అవసరం అని భావించాం. ఆ దిశగా రాష్ట్ర అప్పులను రీ స్ట్రక్చర్ చేయించే ప్రయత్నంలో ఉన్నాం. ఇటీవల అమెరికా పర్యటనలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశమయ్యాం. తక్కువ వడ్డీలతో రాష్ట్రాభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చుకునే అంశంపై మా మధ్య సానుకూల చర్చలు జరిగాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. గతంలో మాదిరిగా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి… రాష్ట్ర ప్రజల నెత్తిన మోయలేని భారం మోపే పనులు మేం చేయబోం. ఆర్థిక అవరోధాలు ఉన్నా ప్రతి ఇంటా సౌభాగ్యాన్ని నింపాలనే మహాసంకల్పంతో రూపొందించిన అభయహస్తం హమీలన్నీ తూ.చ తప్పకుండా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
Rythu Runa Mafi: రూ.2 లక్షల పైనున్న అప్పులు ఆగస్టు 15వ తేదీ తర్వాత..
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!