Ration Cards: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా జారీ చేయబోతున్న రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీకి సంబంధించిన నిబంధనలు మార్చాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో 5.67 లక్షల నిరుపేద కుటుంబాలు అంత్యోదయ అన్న యోజన కార్డులను ఉపయోగిస్తున్నారని గుర్తు చేశారు. ఈ మేరకు రేషన్ కార్డుల జారీ కోసం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీకి ఓవైసీ వినతి పత్రం అందజేశారు.
Read Also: KTR: తెలంగాణ తల్లిని అవమానిస్తారా..?
ఇక, గ్రామాల్లో రూ.1.5 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలుగా ఉన్న ఆదాయ పరిమితితో పాటు భూ పరిమితిని ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సవరించాలని ఎంఐఎం ఎపీ అసదుద్దీన్ ఓవైసీ కోరారు. ఈ క్రమంలో దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారి కుటుంబాలకు, ఒంటరి మహిళలకు, హస్త కళాకారులకు అంత్యోదయ అన్న యోజన కార్డులను ఇవ్వాలని తెలంగాణ సర్కార్ కు ఆయన సూచించారు. ప్రస్తుతం ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ తెలుపుతుంది. ఇకపోతే, రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం విధించిన ఆదాయ నిబంధనలను మార్చాలని చాలా రోజులుగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ రోజు జలసౌదాలో జరిగే జరిగే సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది అనేది వేచి చూడాలి.