NTV Telugu Site icon

Rahul Gandhi: హైదరాబాద్‌లో రాహుల్ ఆకస్మిక పర్యటన.. నిరుద్యోగులతో చిట్ చాట్

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: తెలంగాణలో మరో నాలుగు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ గెలుపే ధ్యేయంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. పార్టీల అగ్రనేతలు ఈ ప్రాంతంలో నిరంతరం పర్యటిస్తూ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తున్నారు. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్‌కు విజయం సాధించేందుకు ఆ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ రాష్ట్రంలో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బహిరంగ సభలు, రోడ్ షోల ద్వారా ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శల వర్షం చేస్తున్నా రాహుల్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. తమ పార్టీ అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి చెబుతూనే ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈసారి తెలంగాణలో అధికార పగ్గాలు చేజిక్కించుకోవాలని హస్తం పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొంటూ ప్రచారం చేస్తున్నారు.

Read also: KP Krishnamohan Reddy: వైసీపీ నాయకులపై దుష్ప్రచారం తగదు: కృష్ణమోహన్ రెడ్డి

అయితే.. రాహుల్ గాంధీ శనివారం రాత్రి ఆకస్మికంగా హైదరాబాద్ పర్యటించారు. నగరంలోని ముషీరాబాద్‌, అశోక్‌నగర్‌లో పర్యటించిన రాహుల్‌ ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో ముచ్చటించారు. నిరుద్యోగులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ బాధలను పంచుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పేపర్ లీకేజీలు, నోటిఫికేషన్లు నిలిచిపోయిన ఘటనలపై నిరుద్యోగులు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. నిరుద్యోగుల పట్ల సీఎం కేసీఆర్ వైఖరిని తీవ్రంగా ఖండించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. అనంతరం చిక్కడపల్లిలోని బావర్చి హోటల్‌లో రాహుల్ నిరుద్యోగులతో కలిసి బిర్యానీ తిన్నారు. అక్కడ కస్టమర్లను కలిశారు. ఈ క్రమంలో పలువురు రాహుల్ గాంధీతో సెల్ఫీలు దిగారు.
Koti Deepotsavam 2023 13th Day: ఘనంగా కొనసాగుతున్న కోటి దీపోత్సవం.. నేటి విశేష కార్యక్రమాలు..