NTV Telugu Site icon

Krishnaiah: బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసమే రాజీనామా చేశా..

R Krishnaiah

R Krishnaiah

Krishnaiah: బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం రాజీనామా చేశాను అని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేయబోతున్నాను.. ఉద్యమం బలోపేతం చేస్తే బీసీల న్యాయ బద్ద వాటా వస్తుంది.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వస్తాయని అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నా కమిట్మెంట్ ను గుర్తించి నాకు రాజ్యసభ ఇచ్చారు.. రాజ్యాధికారంలో వాటా బీసీలకు దక్కాలి అని ఆయన డిమాండ్ చేశారు. ఇక, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి.. పార్టీ రహితంగా ఉద్యమం నడపాలనే ఉద్దేశ్యంతోనే వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను అని ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు.

Read Also: Suriya45 : చిన్న దర్శకుడితో తమిళ హీరో సూర్య భారీ సినిమా..

ఇక, దేశ వ్యాప్తంగా బీసీలకు తగిన న్యాయం జరగాలి అని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య చెప్పుకొచ్చారు. చట్ట సభల్లో ప్రతినిధులము కావాలి.. సామాజిక న్యాయం కోసం జగన్ నాకు ఎంపి పదవి ఇచ్చారు.. తెలంగాణలో బలమైన బీసీ ఉద్యమం ఉంటే అది ఇతర రాష్ట్రాల మీద పడుతుంది.. కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందన్నారు. అన్ని పార్టీలు నన్ను సంప్రదించాయి.. చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు సాధించడం నా లక్ష్యం అని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో బీసీ నేతలు పార్టీలు పెట్టారు.. వివిధ కారణాలతో సక్సెస్ కాలేక పోయారు.. ఇప్పుడు పార్టీ పెట్టడానికి సరైన సమయం.. రాజకీయ పార్టీ పెట్టాలనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.. కొత్త పార్టీ పెట్టాలనే ఒత్తిడి వస్తుంది అని కృష్ణయ్య అన్నారు.