Saibaba Daughter Manjira: చనిపోయే ముందు నాన్నతో ఒక బుక్ గురించి చర్చించాము కానీ.. నాన్న ఇక లేరు మమ్మల్ని ఎంతగానో బాధిస్తుందని ప్రొఫెసర్ సాయిబాబా కూతురు మంజీర కన్నీరు పెట్టుకున్నారు. కూతురు మంజీరా మాట్లాడుతూ.. చనిపోయే ముందు నాన్నతో మాట్లాడానని.. ఒక బుక్కు గురించి చర్చించామన్నారు. ఇద్దరం కలిసి చదువుదాం అన్నారు. నాతోనే సమయం గడుపుతామన్నారు నాన్న అని తెలిపారు. కానీ నాన్న ఇక లేరు మమ్మల్ని ఎంతగానో బాధిస్తుందన్నారు. నాగపూర్ జైల్లో సమస్యల వల్ల గాల్ బ్లాడర్ లో స్టోన్స్ వచ్చాయని.. ఇంటర్నల్ బ్లడ్ బ్లీడింగ్ అయిందన్నారు. తన శరీరానికి వైకల్యం ఉన్నా సరే దేశం దివ్యంగా ఉండాలని కోరుకున్న వ్యక్తి మా నాన్న అన్నారు. ఏం చేయక పోయిన జైల్లో పెట్టారని భావోద్వేగానికి లోనయ్యారు. జైల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించలేక పోయిందన్నారు. సమాజం కోసం ఆయన తన జీవితాన్ని త్యాగం చేశాడని కూతురు మంజీరా తెలిపారు.
Read also: Milkshake vs Fruit Juice: మిల్క్ షేక్ లేదా ఫ్రూట్ జ్యూస్.. మీ ఆరోగ్యానికి ఏది మంచిది?
మరోవైపు సాయిబాబా సతీమణి వసంత కుమారి, సోదరుడు రామ్ దేవ్ మాట్లాడుతూ.. సాయిబాబా సమాజానికి ఎంతో చేశారన్నారని సతీమణి వసంత కుమారి తెలిపారు. సాయిబాబా సహజ మరణం కాదు, ఇద్ది ముమ్మాటికి రాజ్యాధికారం హత్యే అన్నారు. నాగపూర్ జైలు లో సరైన వైద్య సదుపాయ లేక అవయవాలలు దెబ్బతిన్నాయన్నారు. సాయిబాబా జైలులో కి సరైన సదుపాయాలు కల్పించలేదని వాపోయారు. సాయిబాబా నిర్దోషిగ తేలడానికి తొమ్మిది సంవత్సరాలు కాలం పట్టింది ఇది దారుణం అని కన్నీరుపెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేళ్లు వెంటాడి ఆయన్ను వేధించిందన్నారు. ప్రొఫెసర్ సాయి బాబా లాంటి వ్యక్తులు సమాజానికి అవసరం అన్నారు. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత నిమ్స్ లో చికిత్స పొందారని.. తిరిగి మా మధ్యలో వస్తారు అనుకున్నాం కానీ అంతలోనే ఇలా జరిగిందని తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.
Read also: Prashanth neel : ఎవరైనా సరే ఆరేళ్లు ఆగాల్సిందే.. నీల్ మామ లైనప్ లో నలుగురు స్టార్లు
ఇవాళ ప్రొఫెసర్ సాయిబాబా అంతిమ యాత్ర నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు నిమ్స్ హాస్పిటల్ మార్చురీ నుండి పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు తీసుకొని గన్ పార్క్ బయల్దేరానున్నారు. ఉదయం 9 గంటలకు గన్ పార్క్ వద్ద నివాళి అర్పించనున్నారు. అనంతరం గన్ పార్క్ నుండి నేరుగా మౌలాలి లోని సాయిబాబా నివాసానికి పార్థివ దేహాన్ని తీసుకుని వెళ్లనున్నారు. మౌలాలిలోని తన నివాసంలో మిత్రులు శ్రేయోభిలాషులు ప్రజా సంఘాలు పౌర హక్కుల సంఘం నేతలు రాజకీయ నాయకులు ప్రొఫెసర్లు సందర్శనార్థం పార్థివ దేహం ఇంటివద్ద పెట్టనున్నారు. ఇంటి నుండి సాయంత్రం 4 గంటలకు సాయిబాబా పార్ధవ దేహాన్ని కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రి మెడికల్ కాలేజ్ అప్పగించనున్నారు.
Devara: నందమూరి ఫ్యాన్స్ పై కీలక వ్యాఖ్యలు చేసిన నాగవంశీ..