Site icon NTV Telugu

V. Hanumantha Rao: మోడీ బీసీ అయ్యుండి.. కుల గణన చేయడానికి ఆలోచిస్తున్నారు!

Vh

Vh

V. Hanumantha Rao: కుల గణనపై ఎవరు మాట్లాడనప్పుడే రాహుల్ గాంధీ మాట్లాడారు అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు పేర్కొన్నారు. ఎవరు ఎంతో, వారికి అంత అని చెప్పారు.. ఇప్పటి వరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మూడు సార్లు కలిసి బీసీలకి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వు అని కోరినా ఇవ్వలేదు.. జన గణనతో మాకు వచ్చే లాభం లేదు అని తేల్చి చెప్పారు. కుల గణన చేస్తే మాకు మంచిది.. రాహుల్ గాంధీ అగ్రకులంలో పుట్టినా బీసీలకు న్యాయం చేయాలని మాట్లాడారు.. మోడీ బీసీ అయినా, కుల గణన చేయడానికి ఆలోచిస్తున్నాడు అని ఎద్దేవా చేశారు. జన గణనతోనే కుల గణన చేయాలి అని వి. హనుమంతరావు డిమాండ్ చేశారు.

Read Also: CM Chandrababu: వ్యర్థాల నుంచి సంపద సృష్టిపై సీఎం సమీక్ష.. 11 రంగాలపై ఫోకస్‌..

ఇక, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖతో పాటు కుల గణన చేయాలని వీహెచ్ కోరారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎంపీలు నోరు విప్పాలి.. లేదంటే, ఎంపీల ఇంటి ముందు ధర్నా చేస్తాను అని హెచ్చరించారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కులగణన సర్వే బీసీలకు న్యాయం చేసింది.. అలాగే, కేంద్ర ప్రభుత్వం కూడా కుల గణన చేపట్టి బీసీలకు రావాల్సిన న్యాయమైన వాటాను అందజేయాలని అన్నారు.

Exit mobile version