NTV Telugu Site icon

DSC Hall Ticket: డీఎస్సీ హాల్‌టికెట్‌లో అబ్బాయికి బదులు అమ్మాయి ఫొటో.. అప్లై ఎలా చేశారో..!

Dsc 2024

Dsc 2024

DSC Hall Ticket: తెలంగాణలో డీఎస్సీ పరీక్షల హాల్‌ టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ మేరకు విద్యాశాఖ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. హాల్ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. డీఎస్సీ హాల్ టికెట్లను https://tsdsc.aptonline.in/tsdsc/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 11,062 పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరి 29న ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు బాగానే వున్నా డీఎస్సీ హాల్ టికెట్ల వ్యవహారం తెలంగాణలో చర్చకు దారితీసింది.

Read also: Uttarpradesh : అంతా అబద్ధం.. ఆ యువకుడిని ఏడు సార్లు కాదు ఒక సారే పాము కరిచింది

అయితే.. దమ్మాయిగూడ బాలాజీనగర్‌కాలనీకి చెందిన రాంచంద్రయ్య వల్లెపు డీఎస్సీ రాస్తున్నాడు. ఇక హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోగా వివరాలు సక్రమంగానే ఉన్నా ఫొటో, సంతకం మాత్రం అమ్మాయిది రావడంతో కంగుతిన్నాడు. డీఎస్పీ అప్లై చేస్తున్నప్పుడు ఎలా చేశారో తెలియదు కానీ.. హాల్‌ టికెట్లలో మాత్రం గందరగోళం చోటు చేసుకుంది. డీఎస్సీ అప్లై కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు, అప్లికేషన్ ఫారమ్ లింక్ చేసేప్పుడు ఎలా చేశారో ఏంటో అంటూ అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. దరఖాస్తు ప్రక్రియదారులపై మండిపడుతున్నారు. ఇలా రాంగ్‌ వచ్చిన హాల్‌ టికెట్లపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. మేము కూడా పరీక్షలు ఏ విధంగా రాయాలనేదానిపై ప్రశ్నలు వస్తున్నాయని వాపోతున్నారు. ఇన్ని రోజులుగా డీఎస్సీ కోసం ఎదురు చూసామని, ఇప్పుడు తీరా తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం స్పందించి డీఎస్సీ ప్రకటిస్తే తప్పులతో విద్యార్థుల జీవితాలు గాడితప్పుతున్నాయని కన్నీరుమున్నీరుగా విలపిస్తు్న్నారు. ఇది ప్రభుత్వం తప్పిదం అంటూ వార్తలు వస్తున్నాయని ఇదంతా అపద్దమని తెలిపారు. అప్లై చేసేందుకు వెళ్లినవారు కంప్యూటర్ల వద్దకు చాలా మంది అభ్యర్థులు వస్తారని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. అసలే డీఎస్సీ వాయిదా వేయాని కొందరు అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం యువత భవిష్యత్తును ఆలోచించి డీఎస్సీ నిర్వహిస్తామని తేల్చి చెప్పింది. దీంతో డీఎస్సీ అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో హాల్‌ టికెట్‌ లో ఇలా గందరగోళంపై సర్వత్రా చర్చకు దారి తీస్తోంది.
Vizag Erra Matti Dibbalu: విశాఖ ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై ప్రభుత్వం సీరియస్.. కీలక ఆదేశాలు..