NTV Telugu Site icon

Formula-Car Race Case: ఫార్ములా-ఈ రేసు కేసులో ఏసీబీ దూకుడు.. కీలక పరిణామాలు..

Danakishore E Car Rase

Danakishore E Car Rase

Formula-Car Race Case: ఫార్ములా-ఈ రేసు కేసులో కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏసీబీ అధికారులకు హైకోర్టు ఉత్తర్వులు అందాయి. ఈ ఫార్ములా కేసులో ఫిర్యాదుదారుడు దాన కిషోర్ స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. దాన కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ విచారణ ప్రారంభించనున్నారు. దాన కిషోర్ నుంచి పలు కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీన పరుచుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి దాన కిషోర్ వివరణ ఇచ్చారు. మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరికే డబ్బులు బదిలీ చేసినట్లు వెల్లడించారు. తన పరిధిలో ఉన్న హెచ్ఎండీఏ ద్వారా ఎఫ్ఈఓ కు డబ్బులు బదిలీ చేసినట్లు వెల్లడించారు. రూ.55 కోట్ల రూపాయల నగదును ఏపీవోకు బదిలీ చేసినట్లు దాన కిషోర్ పేర్కొన్నారు.

Read also: Jagtial Tragedy: ఆ నలుగురు సినిమా సీన్‌ రిపీట్‌.. ఆస్తి పంచుకుని అంత్యక్రియలకు రాని బంధువులు..

దానకిషోర్ వాంగ్మూలం ఆధారంగా ఈ కేసును ఏసీబీ దర్యాప్తు ప్రారంభించనుంది. త్వరలో కేటీఆర్, అరవింద్ కుమార్‌లకు నోటీసులు జారీ చేయనుంది. దానకిషోర్ వాంగ్మూలాన్ని బట్టి వారిద్దరినీ ప్రశ్నించే అవకాశం ఉంది. దానకిషోర్ వద్ద తీసుకున్న పత్రాలను వారి ముందు ఉంచడం కూడా వుంచే అవకాశం కూడా ఉంది. ఫార్ములా-ఇ కార్ రేసింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఇప్పటికే కేసు నమోదైంది. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిపై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది.

Read also: Nizamabad Crime: నిజామాబాద్‌లో ఘరానా మోసం.. 18 పౌండ్ల కోసం రూ.2.75 లక్షల ఫ్రాడ్‌..

ఫార్ములా-ఇ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి లేఖ రాస్తూ ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరారు. ఫార్ములా రేస్, అనుమతి లేకుండా హెచ్‌ఎండీఏ అగ్రిమెంట్‌పై సంతకాలు చేయడం, రూ.55 కోట్ల విదేశీ కరెన్సీ చెల్లించడంపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో కేటీఆర్‌తో పాటు అప్పటి మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌, చీఫ్‌ ఇంజనీర్‌లను బాధ్యులుగా పేర్కొంది.
Warangal Crime: వరంగల్ జిల్లాలో దారుణం.. గర్ల్స్ క్యాంపస్‌లో విద్యార్థిని ఆత్మహత్య..