NTV Telugu Site icon

Driving Licence: మాన్యువల్​ పద్ధతికి ఇక చెక్.. డ్రైవింగ్ ​లైసెన్స్​కు కొత్త పరీక్ష..

Telangana Friving Leicence

Telangana Friving Leicence

Driving Licence: భాగ్యనగరంలో డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియను ఆటోమేటిక్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ కు ఆర్టీఏ అధికారులు నిర్ణయించారు. ప్రస్తుత విధానం కంటే ప్రామాణికమైన డ్రైవింగ్ టెస్టులు నిర్వహించాలని యోచిస్తున్నారు. ఇందుకోసం ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించేందుకు ఆర్టీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కొత్త పద్ధతిలో రోడ్లపై నిత్యం ఎదురయ్యే వివిధ రకాల ఇబ్బందులను టెస్ట్ ట్రాక్‌పై కృత్రిమంగా సృష్టించారు. ఇకపై టెస్ట్ డ్రైవింగ్ కు వచ్చే వారు వేరేదారిలో లైసెన్స్ పొందే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. డ్రైవింగ్‌లో శిక్షణ పొంది, నైపుణ్యంతో పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికే లైసెన్స్ జారీ చేస్తామని అధికారులు తెలిపారు. ఇక.. కొత్తగా అమలు చేయబోయే ఆటోమేటిక్​ డ్రైవింగ్​టె టెస్ట్ లో ఐదు రకాల ట్రాక్​లను ఏర్పాటు చేయనున్నారు.

Read also: Uttarakhand : బద్రీనాథ్ హైవే మూత.. జోషిమఠ్‌లో చిక్కుకున్న 3 వేల మంది యాత్రికులు

కొత్త పద్ధతి ఇలా..

1. హెచ్​ అనే ట్రాక్​ లో ఆర్టీఏ ప్రమాణాలను పేర్కొన్న విధంగా వాహనాన్ని రివర్స్​చేయాలి.

2. ఎస్​ అనే ట్రాక్​ లో ఒక మూల నుంచి మరో మూలకు వెహికల్​ను టర్న్​చేయాలి.
3. కె అనే ట్రాక్​ లో బాగా మలుపులు, ఎత్తుపల్లాలు, ఎత్తయిన ప్రదేశాలు, చిన్న లోయలు వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. వాటిలో వాహనాన్ని నడపాలి. చివరగా బండిని పార్కింగ్​ చేసి చూపించాల్సి ఉంటుంది.

4. ట్రాఫిక్​ నిబంధనల ప్రకారం టూ వీలర్స్​ హెల్మెట్,​ ఫోర్​వీలర్స్​ సీటు బెల్ట్​ పెట్టుకోవాలి. ఈ ప్రక్రియ అంతా కంప్యూటర్​లో నమోదు చేసి ఉంటుంది. లైసెన్స్‌ కోసం వచ్చిన వారు ట్రాక్​ పై వాహనాన్ని నడిపేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేసినా కంప్యూటర్​లో నమోదవుతుంది. దీంతో టెస్ట్ లో ఫెయిల్​ అయినట్టు చూపిస్తుంది.

5. టెస్ట్ లో ఫెయిల్​ అయితే.. మరో నెల రోజుల పాటు ట్రైనింగ్‌ తీసుకుని రమ్మంటారు. పూర్తిగా కంప్యూటరీకరణ వల్ల ఇక్కడ అధికారులను.. సిబ్బందిని మేనేజ్​ చేసేందుకు అవకాశం ఉండదని అధికారులు తెలిపారు. అంతేకాదు బ్రోకర్లకు కూడా అవకాశం ఉండదని చెప్తున్నారు.
వాటిని తనిఖీ చేయండి..

Read also: Raj Tarun Lavanya : రాజ్ తరుణ్ – లావణ్య కేసులో లాయర్ కళ్యాణ్ సంచలన విషయాలు

వారికి నో లైసెన్స్..

అయితే.. వాహనాలు ప్రస్తుతం యువకులు, మహిళలు, వ్యాపారులు, ఉద్యోగులు ఇలా అన్ని రకాల వారు నడుపుతున్నారు. చాలా మంది ఎలాంటి పరీక్షలు లేకుండా హాయినా ఇంటికే లైసెన్స్‌ రావాలని కోరుకుంటారు. దీని వల్ల చాలామంది అడ్డదారులు తొక్కుతున్నారు. ఇక పూర్తిగా లైసెన్స్ పొందాలంటే డ్రైవింగ్ స్కూల్స్ లో నెల రోజుల పాటు శిక్షణ పొందాలి. ఆ తర్వాత, RTAకి లైసెన్స్ కోసం దరఖాస్తు చేస్తే పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి తాత్కాలిక లైసెన్స్ జారీ చేస్తారు. ఆరు నెలల తర్వాత ఆర్టీఏ కార్యాలయాల్లో టెస్ట్‌ డ్రైవింగ్‌ ట్రాక్‌పై వాహనాలు నడిపిన తర్వాతే శాశ్వత లైసెన్స్‌ జారీ చేస్తారు.

అంతేకాకుండా.. కొన్ని సందర్భాల్లో డ్రైవింగ్ టెస్ట్ లో వాహనాలు సరిగ్గా నడపకపోయినా.. కొందరు అధికారులను సంప్రదించడం వలన వారికి లైసెన్స్ ఇచ్చేస్తున్నారు. దీంతో పూర్తి స్థాయిలో డ్రైవింగ్ నైపుణ్యం లేని వారికి కూడా లైసెన్సులు జారీ చేస్తున్నారు. ఇలా లైసెన్సులు పొందిన వారికే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రహించింది. దీనిపై ఆర్టీఏ అధికారులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ తరహా విధానానికి స్వస్తి పలికేందుకు ఉన్నతాధికారులు డ్రైవింగ్‌లో నైపుణ్యం ఉన్నవారికే లైసెన్స్‌ పొందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
Bharateeyudu 2 Public Talk: ‘భారతీయుడు 2’ పబ్లిక్ టాక్.. ఆడియన్స్ ఏమంటున్నారంటే?