NTV Telugu Site icon

Jeedimetla Traffic Police: ఏంటి సార్‌ ఆ బూతులు.. ప్రయాణికుడిపై పోలీసుల అత్యుత్సాహం..

Jeedimetla Police

Jeedimetla Police

Jeedimetla Traffic Police: రాష్ట్రంలో పోలీసుల వ్యవహారశైలిపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ప్రయాణికులపై పోలీసులు అత్యుత్సాహం ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గండి మైసమ్మ నుండి నర్సాపూర్ లో జరిగిన ఘటనే దీని ఉదాహరణ అంటున్నారు ప్రయాణికులు. నర్సాపూర్ వెళ్ళే దారిలో ఓ డ్రైవర్ రోడ్డు పక్కనే లారీని ఆపాడు. రోడ్డుపై వాహనాలకు ఆటంకం అవుతుందని ఇలా ఎక్కడంటే అక్కడ వాహనాలు ఎలా నిలిపివేస్తారంలూ లారీ డ్రైవర్ పై విరుచుకుపడ్డారు. అతనిపై వినరాని భాషలో సాధారణ పౌరుడిని పోలీస్‌ సిబ్బంది దుర్భాషలాడటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

Read also: Mallu Bhatti Vikramarka: లీడ్ బ్యాంకులు లోన్ల విషయంలో ఎక్కడ అశ్రద్ధ చూపొద్దు..

వాహనదారుడిపై జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్సై యాదగిరి చేయిచేసుకుని, దుర్భాషలాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో ప్రయాణిలు పోలీసులపై మండిపడుతున్నారు. లారీ డ్రైవర్ చేసింది తప్పే.. కానీ ఒక డ్యూటీలో వున్న ట్రాఫిక్ పోలీస్ అయి ఉండి ఇలాంటి భాషను ఉపయోగించడం సరికాదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పక్కన వాహనాలు నిలిపినందుకు చాలన్లు వేయాలి కానీ.. ఇలా బూతులు తిడుతూ, చేయి చేసుకోవడం ఏంటని మండి పడుతున్నారు వాహన దారులు. లారీ సాంకేతిక సమస్య తో ఆగింది అంటే కూడా వినకుండా, నో పార్కింగ్‌ లో వాహనం నిల్పినందుకు కొడుతూ, బూతు పురాణం అందుకున్నాడు సదరు ఎస్సై. పక్క రాష్ట్రాల డ్రైవర్ల కు ఇంత మంచి మర్యాద ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. కొద్దిగా ఇలాంటి పోలీసులకు ట్రైనింగ్ ఇచ్చి విధులల్లోకి పంపించాలని స్థానికులు సూచిస్తున్నారు.

Read also: Shamshabad: ముందే చూసుకోరా.. లోపమంటే ఎలా..? ఎయిర్‌పోర్టు లో ప్రయాణికుల ఆందోళన..

ఇందిరాపార్క్ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారుల పై చిక్కడపల్లి ట్రాఫిక్ పోలీసులు జులుం

ఇక మరోవైపు ఇందిరాపార్క్ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారుల పై చిక్కడపల్లి ట్రాఫిక్ పోలీసులు జులుం చూపించారు. రోడ్డు మీద బ్రతుకుతున్న చిరు వ్యారులపై పోలీసులు ప్రతాపం చూపించారు. గత కొన్నేళ్లుగా ఇందిరా పార్క్ వద్ద స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపారులపై చిక్కడపల్లి ట్రాఫిక్ ఏసీపీ దౌర్జన్యం చేశారు. స్ట్రీట్ ఫుడ్ వ్యాపారుల పై ఏసీపీ యర్నా నాయక్ దురుసుగా ప్రవర్తించారు. స్ట్రీట్ ఫుడ్ వ్యాపారుల గ్యాస్ సిలిండర్ పోలీసులు తీసుకెళ్లారు. కేసు నమోదు చేస్తామని వ్యాపారులను బెదిరింపులకు పాల్పడ్డారు. స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులను ఇబ్బందులు పెట్టొద్దని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశం చేసిన పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి ఆదేశాలను కూడా ట్రాఫిక్ అధికారులు లెక్కచేయని విడ్డూరంగా ఉందని వాపోతున్నారు. చివరకు ఇందిరాపార్క్ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అయితే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Read also: Sangareddy: జీతాలు ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటాం..300 కార్మికుల ఆందోళన

పోలీసుల వ్యవహార శైలి పై కేటీఆర్ X పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. పోలీసు సిబ్బంది సామాన్య పౌరుడిపై అర్థంకాని భాషలో దుర్భాషలాడడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డులోని గండి మైసమ్మ దేవాలయం సమీపంలో వాహనదారుడిపై ట్రాఫిక్ పోలీసులు అసభ్యంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ స్పందిస్తూ.. ఇది పోలీసు శాఖకు, డీజీపీకి ఆమోదయోగ్యమైన భాష కాదా అని ప్రశ్నించారు. పోలీసులకు, ప్రభుత్వ అధికారులకు జీతాలు ఇస్తున్నది ప్రజలే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.
AP-Telangana: రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు..

Show comments